Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవడం ఇక మరింత ఈజీ.. ఒక్క క్లిక్‌తో ఇలా..
మీరే వేరే ఇంటికి మూవ్ అయ్యారా..? డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారా.. అయితే నో టెన్షన్. ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా సులువుగా అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఒక వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్ సైట్ ద్వారా ఎలా మార్చుకోవాలంటే..

డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తున్నాయి. మీరు వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు లేదా ఇళ్లు మారినప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్‌లోని చిరుమానాను సులువుగా మార్చుకోవచ్చు. మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేకుండా కేవలం మీ మొబైల్ నుంచే ఇంటి వద్ద ఆన్‌లైన్ ద్వారా అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం పరివాహన్ అనే వెబ్‌సైట్ తీసుకొచ్చింది. ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా మీరు సులువుగా అప్‌డేట్ చేసుకోవచ్చు. స్టేట్, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంచుకుని దరఖాస్తు సమర్పించాలి. అడ్రస్ ఫ్రూఫ్ కింద కరెంట్ బిల్లు, ఆధార్ లేదా గ్యాస్ బిల్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేశాక సమీపంలోని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి ధృవపత్రాలు అందించాల్సి ఉంటుంది. అధికారులు పరిశీలించి మీ అప్లికేషన్‌ను ఆమోదిస్తారు. అనంతరం కొద్ది రోజుల్లోనే మీ ఇంటికి పోస్ట్ ద్వారా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది.
అవసరమైన డాక్యుమెంట్స్
-డ్రైవింగ్ లైన్స్ ఒరిజినల్ -గ్యాస్ బిల్లు -ఆధార్ కార్డ్ -ఓటర్ ఐటీ -కరెంట్ బిల్లు -40 ఏళ్లు దాటినవారు మెడికల్ సర్టిఫికేట్
మార్చుకోవడం ఎలా అంటే..?
-parivahan.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లాలి -హోమ్ పేజీలో ఆన్‌లైన్ సర్వీసెస్ ఎంచుకోవాలి -డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఆఫ్షన్ సెలక్ట్ చేసుకోవాలి -కొత్త పేజీలో స్టేట్ ఎంచుకోవాలి -ఆ తర్వాత అడ్రస్ చేంజ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి -కంటిన్యూపై క్లిక్ చేయండి -డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి -గెట్ డీఎల్ డీటైల్స్ క్లిక్ చేయండి -ఫీజు చెల్లించండి -స్లాట్ బుకింగ్ వివరాలు నింపండి -అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయండి -దగ్గర్లోని ఆర్టీఏ కార్యాలయంకు పత్రాల పరిశీలన కోసం వెళ్లే టైమ్, డేట్‌ను ఎంచుకోండి -ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి మీ ధృవపత్రాల పరిశీలన పూర్తి చేయండి -ఆ తర్వాత కొత్త అడ్రస్‌తో పోస్ట్ ద్వారా మీకు స్మార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ వస్తుంది
