AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart phone: స్మార్ట్‌ ఫోన్‌ పోతే.. యూపీఐ ఐడీల పరిస్థితి ఏంటి.?

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్‌ కచ్చితంగా ఉండే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు పెరిగిన తర్వాత స్మార్ట్‌ ఫోన్‌ లేనిది రోజు గడవని పరిస్థితి వచ్చింది. అయితే ప్రతీ రోజూ వేలల్లో లావాదేవీలు చేసే యాప్స్‌ఉండే ఫోన్‌ ఎక్కడైనా పడిపోయినా, లేదా ఎవరైనా దొంగలించినా అప్పుడు పరిస్థితి ఏంటి.?

Smart phone: స్మార్ట్‌ ఫోన్‌ పోతే.. యూపీఐ ఐడీల పరిస్థితి ఏంటి.?
UPI
Narender Vaitla
|

Updated on: Aug 10, 2024 | 5:28 PM

Share

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్‌ కచ్చితంగా ఉండే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు పెరిగిన తర్వాత స్మార్ట్‌ ఫోన్‌ లేనిది రోజు గడవని పరిస్థితి వచ్చింది. అయితే ప్రతీ రోజూ వేలల్లో లావాదేవీలు చేసే యాప్స్‌ఉండే ఫోన్‌ ఎక్కడైనా పడిపోయినా, లేదా ఎవరైనా దొంగలించినా అప్పుడు పరిస్థితి ఏంటి.? ఈ సందేహం ఎప్పుడైనా వచ్చిందా.? ఒకవేళ నిజంగానే మీ ఫోన్‌ పోయిందనుకోండి. మీ ఫోన్‌లోని యూపీఐ ఐడీలను బ్లాక్‌ చేసే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్‌పే వంటి ఎన్నో రకాల యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరి వీటిని బ్లాక్‌ ఎలా చేయాలి.? మన దగ్గర ఫోన్‌ ఉంటే ఇట్టే యాప్స్‌ను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఫోన్‌ లేకపోతే పరిస్థితి ఏంటి.? ఇందుకోసం కూడా ఓ మార్గం ఉంది. యూపీఐ ఐడీని నిమిషాల్లోనే సులభంగా బ్లాక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని టోల్‌ ఫ్రీ నెంబర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటికి కాల్‌ కాసి కొన్ని వివరాలు తెలిజేయడం ద్వారా మీరు మీ యూపీఐ ఐడీని బ్లాక్‌ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో హ్యాకింగ్ కూడా ఎక్కువవుతోంది. యూపీఐ ఐడీలను హ్యాక్‌ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారు కూడా ఈ నెంబర్లకు కాల్ చేసిన యూపీఐ ఐడీని బ్లాక్‌ చేసుకుకోవచ్చు.

ఎలా బ్లాక్‌ చేయాలంటే..

ఒకవేళ మీరు గూగుల్ పే ఉపయోగిస్తున్నట్లయితే.. మీరు 1800-419-0157 నెంబర్‌కు కాల్‌ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పేటీఎమ్‌ ఉపయోగిస్తున్నట్లయితే 01204456456 నెంబర్‌కు కాల్‌ చేయాలి. ఇవి టోల్‌ ఫ్రీ నెంబర్స్‌. ఈ నెంబర్లకు కాల్ చేసిన తర్వాత కస్టమర్ కేర్‌ ప్రతినిధులతో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో సదరు యూపీఐ ఐడీ మీదేనా కాదా.? అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి అవతలివైపు నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి సమాధానాలు చెప్పడం ద్వారా మీ యూపీఐ ఐడీని సులభంగా బ్లాక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే