ఒక రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా.. ఇప్పుడు చెప్పండి రూపాయి ఎంత విలువైందో..
Indian Currency Coins: భారత ప్రభుత్వం ఒక రూపాయి నోటుతో సహా వివిధ విలువల నోట్లు, నాణేలను తయారు చేస్తుంది. ఒక నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా..
Indian Currency: భారత ప్రభుత్వం అనేక రకాల కరెన్సీ తయారీని చేస్తుంది. 1 రూపాయి నోటు నుంచి 1, 2, 5, 10, 20 రూపాయల నాణేలను ప్రభుత్వం ముద్రిస్తుంది. కరెన్సీ ముద్రణలో కూడా ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. అటువంటి నాణేలు చాలా ఉన్నాయి. ముద్రణలో ప్రభుత్వం దాని వాస్తవ విలువ కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది. ఉదాహరణకు ఒక రూపాయి నాణెం తయారీకీ అయ్యే ఖర్చు తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురవుతారు. వాస్తవానికి, ఒక రూపాయి నాణెం ముద్రించడం వల్ల ప్రభుత్వానికి దాని అసలు విలువ ఒక రూపాయి కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంతకీ ఒక్క రూపాయి నాణెం తయారీకి ఎంత డబ్బు ఖర్చవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక భారతీయ రూపాయి విలువ వంద పైసలతో సమానం. ప్రస్తుతం, ఒక రూపాయి నాణెం చెలామణిలో ఉన్న అతి చిన్న భారతీయ నాణెం అని చెప్పవచ్చు. 1992 నుండి ఒక భారతీయ రూపాయి నాణేలు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడ్డాయి. గుండ్రని ఆకారంలో ఒక రూపాయి నాణేల బరువు 3.76 గ్రాములు, వ్యాసం 21.93-మిల్లీమీటర్లు, మందం 1.45-మిల్లీమీటర్లు. స్వతంత్ర భారతదేశంలో ఒక రూపాయి నాణేలు మొదటిసారిగా 1950లో ముద్రించబడ్డాయి. ప్రస్తుతం చెలామణిలో ఉన్నాయి.
కరెన్సీని ఎవరు ముద్రిస్తారు?
భారతీయ కరెన్సీలో కొన్ని నోట్లు, నాణేలను ప్రభుత్వం ముద్రించగా.. కొన్ని నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ముద్రించింది. ఒక రూపాయి నోటు, అన్ని నాణేలు ప్రభుత్వం ముద్రించగా, రూ. 2 నుంచి రూ. 500 వరకు ఉన్న నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది. గతంలో ఆర్‌బీఐ రూ.2000 నోటును ముద్రించేది.. అయితే ఇప్పుడు రూ.2000 నోటును వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది.
నాణేల ధర ఎంత?
నాణేల తయారీకి అయ్యే ఖర్చు గురించి మాట్లాడినట్లయితే.. ప్రతి నాణేనికి వేర్వేరు ఖర్చులను ప్రభుత్వం భరించాలి. 2018వ సంవత్సరంలో ఆర్బీఐ అందించిన సమాచారం ప్రకారం.. ఒక రూపాయి నాణెం ధర రూ.1.11 లాగా. అదే సమయంలో రూ.2 రూ.1.28, రూ.5 నాణేలకు రూ.3.69, రూ.10 నాణేలకు రూ.5.54 ఉంది. అయితే పెరిగిన ధరల ప్రకారం ఈ లెక్క మారి ఉంటుందని సమాచారం.
నోట్ల ముద్రణకు ఎంత ఖర్చవుతుంది?
నోటు ప్రింటింగ్ ఖర్చు గురించి చెప్పాలంటే, రూ. 2000 నోటు ప్రింటింగ్ ఖర్చు రూ. 4 వరకు ఉండేది. ఇది కొన్ని పైసల్లో కొద్దిగా మారుతుంది. ఇది కాకుండా 10 రూపాయల 1000 నోట్లకు రూ. 960, 100 రూపాయల 1000 నోట్లు రూ. 1770, 200 రూపాయల 1000 నోట్లు రూ. 2370, 500 రూపాయల 1000 నోట్లు రూ. 2290 ఖర్చు ఉంటుందని ఓ అంచనా.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం