AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

D Mart: డి-మార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి? చాలా మందికి తెలియని రహస్యం ఇదే!

D Mart Price Secret: డిమార్ట్.. దీని నగరాల్లో దీని పేరు తెలియని వారు సామాన్యంగా ఉండదరు. సమాన్యుడికి సరసమైన ధరకే సరుకులను అందించే ఈ సూపర్ మర్కెట్‌ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. అవును డీమార్ట్ సరుకుల ధరలు ఎందుకు అంత తక్కుగా ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా? మిగతా మార్కెట్‌లలో పోలిస్తే డీమార్ట్ ఎందుకు అంత తక్కువకు సరకులను అందిస్తుంది. దీని వెన ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం పదండి.

D Mart: డి-మార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి? చాలా మందికి తెలియని రహస్యం ఇదే!
D Mart Price Secret
Anand T
|

Updated on: Jan 13, 2026 | 1:55 PM

Share

డి మార్ట్ ప్రస్తుతం భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత విశ్వసనీయమైన సూపర్ మార్కెట్‌లో ఒకటి. చిన్న మ్యాగీ నుండి బిస్కెట్లు, చాక్లెట్లు, ఇలా ఇంట్లోకి ఏ నిత్యావసర వస్తువుల కావాలన్నా డిమార్ట్‌ వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడ ప్రతిదానిపై మన డిస్కౌంట్ లభిస్తుంది.. ఇతర మార్కెట్‌లో పోల్చుకుంటే అక్కడ తక్కువ ధరకు సరుకులు దొరుకుతాయి. ఉదాహరణకు, డి మార్ట్ రూ.149 విలువైన పాల ఉత్పత్తులను ఆఫర్ కింద రూ.99లకే పొందచ్చు. అలానే రూ. 99 ఉన్న మ్యాగీని రూ.73కి విక్రయిస్తుంది. అందుకే చాలా మంది డీమార్ట్ వెళ్లి షాపింగ్ చేస్తారు. ఈ ఆఫర్‌ల కారణంగా డీమార్ట్ ఇతర మార్కెట్‌లను వెనక్కి నూకి టాప్‌లో ఉంటుంది.

తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు

అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏమిటంటే..తక్కువ ధరకే సరుకులు ఇవ్వడం ద్వారా డీమార్ట్‌కు నష్టాలు రావా అని.. చాలా మందికి తెలియన విషయం ఏమిటంటే.. డీ మార్ట్ అనే కంపెనీ ఎక్కువ లాభం పొందడం కంటే తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేయడంపై దృష్టి పెడుతుంది. డి మార్ట్‌లో రోజువారీ నిత్యావసర వస్తువులు ఎక్కువగా అమ్ముడవుతాయి. దీంతో స్టాక్‌ను త్వరగా అమ్మివేసి, దాని పెట్టుబడిపై త్వరగా రాబడిని పొందుతుంది.

ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, డీమార్ట్ కంపెనీ సరఫరాదారులతో వ్యవహరించే విధానం. సాధారణంగా ఇతర రిటైల్ కంపెనీలు విక్రేత బిల్లులను క్లియర్ చేయడానికి టైం తీసుకుంటారు. కానీ డీమార్ట్ మాత్రం ప్రతి నెలా బిల్స్ క్లియర్ చేస్తుంది. దీంతో తయారీ దారుకుల కూడా కాస్తా తక్కువ ధరకే డీమార్ట్‌కు వస్తువుల సరఫరా చేస్తారు. అలాగే ఒకేసారి బల్క్‌లో వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా కంపెనీకి భారీ లభిస్తుంది.

ఖర్చుల విషయంలో జాగ్రత్తలు

డి మార్ట్ తన ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. డిమార్ట్ ఎక్కువగా సొంతం స్థలంలోనే సూపర్ మార్కెట్‌లను ఏర్పాటు చేసుకుంటుంది. ఎక్కడైనా రెంట్ తీసుకోవాల్సి వాటిని దీర్ఘకాలిక లీజులకు తీసుకుంటుంది. అందుకే ఖాళీ షెటర్‌లను అద్దెకు ఇస్తుంది.తద్వారా, అద్దె ఖర్చు తగ్గుతుంది. డి మార్ట్ ఖరీదైన ఇంటీరియర్స్, భారీ ఎయిర్ కండిషనింగ్, మ్యూజిక్ సిస్టమ్స్ మొదలైన వాటిపై పెద్దగా ఖర్చు చేయదు దాని వల్ల ఆదా చేసిన డబ్బును డిస్కౌంట్ల రూపంలో కస్టమర్లకు అందిస్తుంది.

డీ-మార్ట్ ఓనర్ విజన్, అనుభవం

డిమార్ట్ ఇంత సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్.. ఈ కంపెనీ యజమాని అయిన రాధాకిషన్ దమానికి ఉన్న అనుభవం. స్టాక్ మార్కెట్లో తాను సంపాదించిన అనుభవాన్ని రిటైల్ రంగంలో ఉపయోగించుకుని అతను డీమార్ట్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. కేవలం ఒక్క స్టోర్‌తో ప్రారంభమైన అతని ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా వందలాది స్టోర్‌లకు చేరుకుంది. మొత్తంగా చూసుకుంటే తక్కువ ఖర్చులు, త్వరితగత చెల్లింపులు, నిత్యావసరాలపై దృష్టి పెట్టడంతో డి-మార్ట్ ప్రజలకు తక్కువ ధరలతో సరుకులను అందించగలుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.