Honda SP160: పల్సర్‌కు పోటీగా హోండా కొత్త బైక్.. 160సీసీతో అధిక పనితీరు.. లుక్, డిజైన్ వేరే లెవెల్ అంతే..
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సరికొత్త 160సీసీ బైక్ ను మనదేశ మార్కెట్లో లాంచ్ చేసింది. దీనిని హోండా ఎస్పీ160 అని పేరుపెట్టింది. దీనిని రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ. 1,17,500 ఎక్స్ షోరూం కాగా, ట్విన్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 1,21,900 ఎక్స్ షోరూంగా ప్రకటించింది. ఈ 160సీసీ మోడల్లో ఇప్పటికే హోండా నుంచే రెండు బైక్ లు ఉన్నాయి. హోండా యూనికార్న్, ఎక్స్ బ్లేడ్ వంటి మోడళ్లు ఉన్నాయి.
ద్విచక్ర వాహన సెగ్మెంట్ లో టాప్ బ్రాండ్ల మధ్య తీవ్ర మైన పోటీ ఉంది. ముఖ్యంగా హోండా, బజాజ్, హీరో వంటి కంపెనీలు పోటా పోటీగా ఉత్పత్తులు లాంచ్ చేస్తుంటాయి. ఒక కంపెనీ ఏదైనా టూ వీలర్ ను మార్కెట్లోకి తీసుకొస్తే.. దానికి పోటీగా అదే ఫీచర్లో వేరే కంపెనీ కొత్త బైక్ ని తీసుకొస్తోంది. ఇదే క్రమంలో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సరికొత్త 160సీసీ బైక్ ను మనదేశ మార్కెట్లో లాంచ్ చేసింది. దీనిని హోండా ఎస్పీ160 అని పేరుపెట్టింది. దీనిని రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. సింగిల్ డిస్క్ వేరియంట్ ధర రూ. 1,17,500 ఎక్స్ షోరూం కాగా, ట్విన్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 1,21,900 ఎక్స్ షోరూంగా ప్రకటించింది. ఈ 160సీసీ మోడళ్లో ఇప్పటికే హోండా నుంచే రెండు బైక్ లు ఉన్నాయి. హోండా యూనికార్న్, ఎక్స్ బ్లేడ్ వంటి మోడళ్లు ఉన్నాయి. అయితే బజాజ్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఎన్ 160కి పోటీగానే ఈ కొత్త బైక్ హోండా ఆవిష్కరించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
హోండా ఎస్పీ 160 స్పెసిఫికేషన్లు..
ఎస్పీ 160 బైక్ లో ఇంజిన్ ని హోండా ఎక్స్ బ్లేడ్ లో వాడినదానినే వినియోగించారు అయితే ఎక్స్ బ్లేడ్ బీఎస్6 స్టేజ్ 2 కంప్లైంట్ కాదు. అయితే ఈ ఎస్పీ 160 బైక్ లో వాడిన ఇంజిన్ బీఎస్6 స్టేజ్ 2 కంప్లైంట్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 13.27 బీహెచ్ పీ, 14.58ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ బైక్ లో డైమండ్ టైప్ ఫ్రేమ్ ని వినియోగిస్తోంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు మోనో షాక్ అబ్జర్బర్ లు ఉంచారు. ముందు వైపు 276ఎంఎం, 220ఎంఎం డిస్క్ బ్రేకలు, లేదా 130 ఎంఎం డ్రమ్ బ్రేకులు ఇస్తారు. అది వేరియంట్ ని బట్టి ఉంటుంది.
హోండా ఎస్పీ 160 ఫీచర్లు..
ఇక ఫీచర్ల విషయానికి వస్తే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, అల్లాయ్ వీల్స్, హాజార్డ్ లైట్లు, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దీనిలో ఫ్యూయల్ ఇండికేటర్, సైడ్ లైట్ ఇండికేటర్, ట్యాకో మీటర్, ఫ్యూయల్ గేజ్, స్పీడో మీటర్, ట్రిప్ మీటర్లు, ఓడో మీటర్లు, బ్యాటరీ ఓల్టేజీని చూపించే విధంగా డిస్ ప్ల్ ఉంటుంది. దీని ఫస్ట్ లుక్ ని ఇప్పటికే విడుదల చేసిన హోండా ఎస్పీ125 లుక్ లో దీనిని తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన డిజైన్ లో ఇది ఆకట్టుకుంటోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..