ICICI Monsoon Bonanza: ఐసీఐసీఐ వినియోగదారులకు బంపర్ బొనాంజా.. షాపింగ్ చేయండి.. ఏకంగా 50శాతం వరకూ తగ్గింపు పొందండి..
ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్. ఏటా మాదిరిగానే బ్యాంక్ కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు అందించే మాన్ సూన్ బొనాంజా ను మళ్లీ తీసుకొచ్చింది. ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి ఎంపిక చేసిన వివిధ కేటగిరీలపై భారీ డీల్స్, డిస్కౌంట్లు అందిస్తోంది. వరుసగా మూడో సంవత్సరం ఈ మాన్ సూన్ బొనాంజా సేల్ ను తీసుకొచ్చినట్లు బ్యాంకు ప్రకటించింది.

ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్. ఏటా మాదిరిగానే బ్యాంక్ కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు అందించే మాన్ సూన్ బొనాంజా ను మళ్లీ తీసుకొచ్చింది. ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి ఎంపిక చేసిన వివిధ కేటగిరీలపై భారీ డీల్స్, డిస్కౌంట్లు అందిస్తోంది. వరుసగా మూడో సంవత్సరం ఈ మాన్ సూన్ బొనాంజా సేల్ ను తీసుకొచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. దీనిలో భాగంగా బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై చేసే లావాదేవీలపై దాదాపు 50 శాతం వరకు వివిధ రకాల డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ వస్తుంది. పలు ఈఎంఐ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ట్రావెల్, ఆన్‌లైన్ షాపింగ్, డైనింగ్, ఫుడ్ ఆర్డరింగ్, హెల్త్ అండ్ బ్యూటీ, గిఫ్టింగ్ వంటి కేటగిరీలలో డీల్స్, డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయని బ్యాంక్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆఫర్ ఎక్కడంటే..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ మాన్ సూన్ బొనాంజా ఎడిషన్ లో ప్రత్యేక ఆఫర్ల ను తీసుకొచ్చింది. వీటిని ఫ్లిప్ కార్ట్, యాపిల్, డెల్, శామ్సంగ్, ఎల్జీ, మేక్ మై ట్రిప్, వన్ ప్లస్, ఖతర్ ఎయిర్ వేస్, టాటా క్లిక్, యాత్ర వంటి ప్లాట్ ఫారంలలో ఆఫర్లను అవేల్ చేసుకోవచ్చు.
మాన్‌సూన్ బొనాంజా ప్రత్యేకతలు..
మాన్‌సూన్ బొనాంజా ‘ఇండిపెండెన్స్ డే స్పెషల్’ లో భాగంగా కస్టమర్‌లు సద్వినియోగం చేసుకోగలిగే ఆఫర్‌లను అందిస్తుంది. ఈ ఆఫర్‌లలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సమయంలో చేసే కొనుగోళ్లపై ఫ్లాట్ 10 శాతం తగ్గింపు, క్రోమాలో లభించే ఉత్పత్తులపై 10 శాతం, తగ్గింపు, యాత్ర బుకింగ్‌లపై రూ. 6,017 వరకు ఆదా చేసుకొనే అవకాశం. అదనంగా, కస్టమర్లు అర్బన్ లాడర్ నుంచి వస్తువులపై 7.5 శాతం తగ్గింపును పొందవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
ల్యాప్‌టాప్‌లు.. మొబైల్‌లు.. టెక్ ఔత్సాహికులు రూ. 2,934 నెలవారీ వాయిదా ద్వారా మ్యాక్‌బుక్ ఎయిర్‌ను పొందవచ్చు. ఇది ప్రత్యేకంగా ఎంపిక చేసిన యాపిల్ రీసెల్లర్ స్టోర్‌లలో లభిస్తుంది. ఇంకా, హెచ్ పీ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను చూస్తున్న కస్టమర్‌లు రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్‌ల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. డెల్ ల్యాప్‌టాప్‌లు రూ.10,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 అయితే నెలకు రూ. 2,341 ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే సమయంలో, వన్ ప్లస్ మొబైల్‌లు, టీవీలపై రూ. 5,000 వరకు ఆదా చేసుకొనే వెసులుబాటు బ్యాంకు కల్పించింది. వివో, జియోమీ, మోటోరోలా మొబైల్‌లపై రూ. 8,500 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఆఫర్.. ఎల్జీ, శామ్సంగ్, హైయర్, ప్యానసోనిక్ వంటి బ్రాండ్ ల నుంచి గృహోపకరణాలపై రూ. 26,000 వరకూ క్యాష్ బాక్ లను పొందే అవకాశం ఉంది. టీసీఎల్, జియోమీ టీవీలపై రూ. 10,000 వరకు తగ్గింపును అందిస్తుంది.
ఫ్యాషన్.. వెస్ట్‌సైడ్ రిటైల్ అవుట్‌లెట్‌లలో బ్యాంక్ రూ. 1,500 వరకు 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. అదనంగా, సెంట్రో రిటైల్ అవుట్‌లెట్‌లో 10 శాతం తక్షణ తగ్గింపుతో రూ. 1,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
హోటల్స్, ఫ్లైట్.. ప్రయాణాలు ఎక్కువ చేసే వారికి మాన్‌సూన్ బొనాంజాలో భాగంగా ప్రతి సోమవారం మేక్‌మైట్రిప్ ద్వారా దేశీయ విమానాలపై రూ. 2,000 వరకు తక్షణ తగ్గింపును ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తోంది. అలాగే ఖతార్ ఎయిర్‌వేస్ బిజినెస్ క్లాస్‌పై 10 శాతం వరకు తగ్గింపు, ఎకానమీ క్లాస్ బుకింగ్‌లపై 7 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ఈస్ మై ట్రిప్, పేటీఎం దేశీయ విమానాలపై రూ. 2,023 వరకు, అంతర్జాతీయ విమానాల్లో రూ. 5,000 వరకు తగ్గింపును అందిస్తాయి. మేక్ మై ట్రిప్ దేశీయంగా రూ. 5,000 వరకు తగ్గింపును, 3, 4 ,5 నక్షత్రాల హోటళ్లలో అంతర్జాతీయ బసపై రూ. 20,000 తగ్గింపును అందిస్తుంది.
ఆన్‌లైన్ కిరాణా, ఫుడ్ ఆర్డర్, డైనింగ్.. టాటా క్లిక్ రూ. 1,500 వరకు తగ్గింపును అందిస్తుంది. అలాగే బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ రూ. 250 వరకు పొదుపును అందిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







