FASTag: మీ ఫాస్టాగ్ బ్లాక్ అయ్యిందా? మళ్లీ యాక్టివ్ చేసుకోవడం ఎలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..
ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) సాంకేతికతపై పని ఇది చేస్తుంది. ట్యాగ్‌కు లింక్ అయిన డిజిటల్ వ్యాలెట్ నుంచి టోల్ చెల్లింపు జరుగుతుంది. అయితే ఆ వ్యాలెట్ లో మీరు తగినంత బ్యాలెన్స్ ముందుగానే ఉంచకపోతే లేదా మీరు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఈ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏమి చేయాలి? తిరిగి ఎలా రీచార్జ్ చేసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
టోల్ ఫీజు నాలుగు చక్రాలు ఆపైన ప్రతి ప్రైవేటు, కమర్షియల్ వాహనాలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ ఫీజులు చెల్లించే విధానాన్ని సులభతరం చేస్తూ ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ఎలక్ట్రానిక్ టోల్ మోడల్ గా పిలుస్తున్నారు. దీనివల్ల వాహనదారుల సమయం ఆదా అవడంతో పాటు సౌకర్యవంతంగా మారింది. 2021, ఫిబ్రవరి 15 నుంచి ఈ విధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ ఎలక్ట్రానిక్ టోల్ చెల్లించాలనుకొనే కారు విండ్‌షీల్డ్‌కు ట్యాగ్ తగిలిస్తారు. ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) సాంకేతికతపై పని ఇది చేస్తుంది. ట్యాగ్‌కు లింక్ అయిన డిజిటల్ వ్యాలెట్ నుంచి టోల్ చెల్లింపు జరుగుతుంది. అయితే ఆ వ్యాలెట్ లో మీరు తగినంత బ్యాలెన్స్ ముందుగానే ఉంచకపోతే లేదా మీరు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఈ ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలలో, మీరు టోల్ ప్లాజాల్లో ఆటోమేటిక్ చెల్లింపులు చేయలేరు.
ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ అయ్యిందని ఇలా తెలుసుకోవచ్చు..
- అధికారిక ఫాస్టాగ్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా మీ ఫాస్టాగ్ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.
- మొదటిగా మీరు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- ఆ తర్వాత మెనూలో కింద భాగాన ఉన్న వాట్ వీ డూ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత ఓపెన్ అయిన మెనూ నుంచి ఎన్ఈటీసీ ఫాస్టాగ్ ఆప్షన్ నిన ఎంచుకోండి.
- చెక్ యువర్ ఎన్ఈటీసీ ఫాస్టాగ్ స్టేటస్ పై క్లిక్ చేయండి.
- మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఫాస్ట్‌ట్యాగ్ ఐడీని నమోదు చేయండి, క్యాప్చా కోడ్‌ను పూరించి, చెక్ స్టేటస్ బటన్‌పై క్లిక్ చేయండి.
- మీకు ఓ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ ట్యాగ్ స్థితిని ప్రదర్శిస్తుంది. బ్లాక్ లో ఉందా? నార్మల్ గానే ఉందా అనేది తెలుస్తుంది.
ఫాస్టాగ్ ఎందుకు బ్లాక్‌లిస్ట్ అవుతుంది..
మీ ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనవి చూద్దాం..
లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ బ్లాక్‌లిస్టింగ్: అనేక నిబంధనల ఉల్లంఘనల కారణంగా మీ వాహనం ఏదైనా చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీ, రాడార్‌లో ఉంటే మీ ఎన్ హెచ్ ఏఐ ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ సంభవించవచ్చు.
బ్యాలెన్స్ లేకపోవడం: ఫాస్ట్‌ట్యాగ్‌కి మీ ఖాతాలో తగినంత మొత్తం లేకపోవడం బ్లాక్ లిస్ట్ కావడానికి ప్రధాన కారణం. మీ ఫాస్టాగ్ లో తగినంత బ్యాలెన్స్ లేని కారణాల వల్ల బ్లాక్‌లిస్ట్ లో చేరితే సమస్యను పరిష్కరించడానికి మీరు మీ ఫాస్టాగ్ జారీ చేసేవారిని సంప్రదించాలి. మీరు మీ ఫాస్ట్ ట్యాగ్ వ్యాలెట్‌ని ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయలేకపోతే, మీరు టోల్ ప్లాజాలో లేదా బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా అలా చేయవచ్చు.
భీబ్ యాప్ తో రీచార్జ్ ఇలా..
భీమ్ యూపీఐని ఉపయోగించి ఫాస్ట్‌ట్యాగ్‌ని ఎలా రీఛార్జ్ చేయాలో ఇక్కడ ఉంది.
- భీమ్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోండి.
- రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ పై సెండ్ ఆప్షన్ ని క్లిక్ చేయండి.
- ఆ తర్వాత సెండ్ మనీని ఎంచుకొని ఫాస్టాగ్ యూపీఐ ఐడీని నమోదు చేసి, దానిని ధ్రువీకరించండి.
- ఎంత రీచార్జ్ చేయాలో నగదు మొత్తాన్ని నమోదు చేయండి.
- మీ పిన్ ఉపయోగించి చెల్లింపు పూర్తి చేయండి.
- ఫాస్టాగ్ రీచార్జ్ విజయవంతం అయ్యిందని ఎస్ఎంఎస్ మీకు వస్తుంది.
గూగుల్ పేతో ఇలా రీచార్జ్ చేసుకోండి..
- మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి న్యూ పేమెంట్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత బిల్ పేమెంట్ ఆప్షన్ ను ఎంచుకోండి.
- వచ్చిన ఆప్షన్లలో నుంచి ఫాస్టాగ్ రీచార్జ్ ను ఎంచుకోండి.
- ఫాస్టాగ్ రీఛార్జ్ సేవను అందించే అన్ని బ్యాంకులు, సంస్థల జాబితాను మీరు పొందుతారు. అందులో మీ బ్యాంకును ఎంచుకోండి.
- ఒక వేళ మీకు ఫాస్టాగ్ అందించిన బ్యాంకు తెలియకపోతే, మీ కారుపై ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్ పై బ్యాంక్ పేరు ఉంటుంది.
- ఆ తర్వాత గెట్ స్టార్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- లింక్ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ కారు రిజిస్ట్రేషన్ నంబర్ ను నమోదు చేసి, ఇతర వివరాలు కూడా ఎంటర్ చేసి, నెక్ట్స్ బటన్ ని క్లిక్ చేయండి.
- నమోదు చేసిన సమాచారాన్ని సమీక్షించి, ‘లింక్ అకౌంట్ ‘పై క్లిక్ చేయండి.
- అనంతరం రీచార్జ్ చేయండి. అప్పటికీ బ్లాక్ లిస్టింగ్ తొలగకపోతే మీ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ టోల్-ఫ్రీ నంబర్‌ను సంప్రదించండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..