Home Loan Rejection: మీ హోమ్ లోన్‌ను బ్యాంకు తిరస్కరించిందా..? కారణాలు ఏంటో తెలుసుకోండి!
గుర్తింపు - చిరునామా రుజువు కోసం, మీరు పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ లేదా ఓటర్ ఐడి కార్డ్ వంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. లోన్ ఆమోదించే ముందు, బ్యాంక్ కస్టమర్ ఆదాయాన్ని అలాగే తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని, అంటే లోన్ తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని తనిఖీ చేస్తుంది. బ్యాంక్‌లు జీతం స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఫారమ్-16 లేదా గత 2-3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్‌లను..
ప్రతి భారతీయ కుటుంబానికి ఒక కల ఉంటుంది. అదే సొంతంగా ఒక గూడు కావాలనేది. అద్దె ఇంట్లో ఉండాలనే ఆసక్తి అసలు ఉండదు. అయితే కొందరు హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే బ్యాంకులు తిరస్కరింస్తుంటాయి. అందుకే లోన్ కోసం అప్లై చేసే ముందు, మీరు అవసరమైన పత్రాలను తెలుసుకోవాలి. మీ లోన్ దరఖాస్తు రిజెక్ట్ కావడానికి గల కారణాలు తెలుసుకోవాలి. మీరు లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, మీరు ముందుగా చూడాల్సింది లోన్ అప్లికేషన్ ఫారమ్. పేరు, చిరునామా, ఆదాయం, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, లోన్ మొత్తం వంటి కస్టమర్ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం మొత్తం ఇందులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
ఇక గుర్తింపు – చిరునామా రుజువు కోసం, మీరు పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ లేదా ఓటర్ ఐడి కార్డ్ వంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. లోన్ ఆమోదించే ముందు, బ్యాంక్ కస్టమర్ ఆదాయాన్ని అలాగే తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని, అంటే లోన్ తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని తనిఖీ చేస్తుంది. బ్యాంక్‌లు జీతం స్లిప్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఫారమ్-16 లేదా గత 2-3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్‌లను అడుగుతాయి. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ సాధారణంగా కనీసం 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ కోసం అడుగుతుంది. ఇది మీ సంపాదన, ఖర్చు, పొదుపు అలవాట్ల గురించి ఆర్థిక సంస్థకు సమాచారాన్ని అందిస్తుంది. ఇది మీ లోన్ అర్హతను గుర్తించడంలో సంస్థలకు సహాయపడుతుంది. అంటే మీరు ఎంత లోన్ పొందగలిగే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని. అలాగే సేల్ డీడ్ లేదా రిజిస్ట్రీ వంటి డాక్యుమెంట్స్ ద్వారా కొనుగోలు చేయాల్సిన ఆస్తి యాజమాన్యం – మార్కెట్ విలువను బ్యాంక్ ధృవీకరిస్తుంది. లోన్ మొత్తం ఆస్తి మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది. అంతే కాదు, మీరు ఆస్తికి సంబంధించిన అప్రూవ్డ్ మ్యాప్, ల్యాండ్ రికార్డ్ పేపర్లు వంటి డాక్యుమెంట్స్ కూడా అందించాలి. బ్యాంకులు స్థానిక అధికారం, కంప్లీషన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మొదలైన వాటి నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NoC) కోసం కూడా అడగవచ్చు.
మీరు జీతం పొందే వ్యక్తి అయితే, మీరు అపాయింట్‌మెంట్, కాంట్రాక్ట్ లేదా ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా అందించాలి. మీ ఉద్యోగంలో మీరు ఎంత స్థిరంగా ఉన్నారో ఈ పత్రాలు చూపుతాయి. మీరు ఎంత కాలంగా పని చేస్తున్నారు.. ఇది మీ లోన్ రీపేమెంట్ సామర్థ్యాన్ని బలపరుస్తుంది. లోన ఆమోదించే ముందు, బ్యాంక్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ ను దీని ద్వారా చెక్ చేస్తుంది. మీ క్రెడిట్ హిస్టరీతో పాటు క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేస్తుంది. ఇది మీ ప్రస్తుత లోన్స్, క్రెడిట్ కార్డ్‌లు, లోన్ తిరిగి చెల్లించే ట్రాక్ రికార్డ్ గురించి బ్యాంకులకు సమాచారాన్ని అందిస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్ లోన్ పొందే అవకాశాలను పెంచుతుంది. మీరు ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో లోన్ పొందవచ్చు. 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ మంచి స్కోర్ గా పరిగణిస్తారు. లోన్ అప్లికేషన్ రిజెక్ట్ కాకుండా ఉండడం కోసం మీరు కొన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
లోన్‌ను ఆమోదించే ముందు, బ్యాంక్ మీ లోన్-ఇన్ కమ్ నిష్పత్తి లేదా DTI నిష్పత్తిని చూస్తుంది. ఇది మీ నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని లోన్ తిరిగి చెల్లించడానికి ఉపయోగిస్తుంది. ఈ నిష్పత్తి 50 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు రుణం పొందే అవకాశాలు పెరుగుతాయి. ఈ నిష్పత్తి బ్యాంకును బట్టి మారవచ్చు. మీకు లోన్ ఇవ్వడానికి బ్యాంక్ నిరాకరించవచ్చు లేదా లోన్ చెల్లించడానికి వెళ్లే భాగం మీ ఇన్ కమ్ లో చాలా ఎక్కువగా ఉంటే ఇప్పటికే ఉన్న కొన్ని క్లోజ్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు. లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయండి. మీ రీపేమెంట్ కెపాసిటీ ప్రకారం లోన్ మొత్తాన్ని ఎంచుకోండి. మీరు మీ కెపాసిటీ కంటే ఎక్కువ రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తే… బ్యాంకు దానిని ప్రతికూలంగా పరిగణించవచ్చు. మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ కావచ్చు. లోన్ రిజెక్ట్ కావడానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు.
అవసరమైన డాక్యుమెంట్‌లను పరిశీలించి, జాగ్రత్తలు తీసుకోండి. మీరు డాక్యుమెంట్‌లను ముందే సిద్ధంగా ఉంచుకుంటే లోన్ ఫైలింగ్ ప్రక్రియ సులభం అవుతుంది. మీరు హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసినపుడు.. కొత్త క్రెడిట్ కార్డ్‌లు లేదా ఇతర రకాల లోన్‌ల కోసం దరఖాస్తు చేయకుండా ఉంటే మంచిది. హోమ్ లోన్ కోసం తక్కువ సమయంలో చేసే ఎక్కువ విచారణ మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటికే ఉన్న లోన్‌ల EMIని సకాలంలో చెల్లించండి. తద్వారా మీరు భవిష్యత్తులో లోన్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోరు. వీలైనంత ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇది లోన్ భారం తగ్గిస్తుంది. లోన్ అప్రూవ్ అయ్యే అవకాశాలను పెంచుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి