HDFC Home Loan: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు ఎదురుదెబ్బ.. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంపు..!

HDFC Home Loan: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ వ్యవస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ( HDFC) గృహ రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది..

HDFC Home Loan: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు ఎదురుదెబ్బ.. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంపు..!
Follow us

|

Updated on: Jun 01, 2022 | 2:35 PM

HDFC Home Loan: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ వ్యవస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ( HDFC) గృహ రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. HDFC గృహ రుణాల కోసం రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (RPLR)ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. నెల రోజుల్లో ఇది మూడోసారి పెంపు. గత నెలలో హెచ్‌డిఎఫ్‌సి రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. కస్టమర్ క్రెడిట్ స్కోర్ 780 కంటే ఎక్కువ ఉంటే అతనికి కనీస వడ్డీ రేటు 7.05 శాతంగా ఉంటుంది. ఇది అంతకు ముందు 7 శాతంగా ఉంది. కొత్త రేట్లు జూన్ 1, 2022 నుండి అమలులోకి వచ్చాయి. గత నెలలో HDFC ఈ మూడవసారి పెంచింది. ఒక నెలలో బ్యాంక్ మొత్తం 40 బేసిస్ పాయింట్లను పెంచింది. మే 1న హెచ్‌డిఎఫ్‌సి వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీని తర్వాత, మే 7 న, 30 బేసిస్ పాయింట్లు పెరిగింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత నెలలో రెపో రేటును 0.40 శాతం పెంచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్త రెపో రేటు ఇప్పుడు 4 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది. రెపో రేటు పెంచిన తర్వాత అన్ని బ్యాంకులు రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)లో 50 బేసిస్‌ పాయింట్లు పెరిగాయి.

హోమ్ లోన్ వడ్డీ రేట్లు:

ఇవి కూడా చదవండి

వడ్డీ రేట్ల పెంపు అంటే 780 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు రూ. 30 లక్షల వరకు గృహ రుణాలకు కనీస వడ్డీ రేటు 7.15 శాతం, రూ.30 లక్షల నుండి రూ. 75 లక్షల వరకు గృహ రుణాలపై వడ్డీ రేటు. 7.40 శాతం ఉంటుంది. 75 లక్షలకు పైబడిన రుణాలపై 7.50 శాతం వడ్డీ వసూలు చేస్తారు. అలాగే గృహ రుణం పొందే మహిళలకు HDFC 5 బేసిస్ పాయింట్ల తగ్గింపును అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి