
మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, షేర్స్, ఎఫ్డీలు.. ఇలా ఇన్వెస్ట్‌మెంట్ కోసం చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో ఏది బెస్ట్ అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. కొందరు బిజినెస్ నిపుణులు మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం స్టాక్స్ ఎంచుకోవాలని సూచిస్తారు. మరి ఎలాంటి స్టాక్స్‌ను ఎంచుకోవాలి.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా.. ఎఫ్‌డీల మాదిరిగానే స్థిరమైన ఆదాయం కోసం స్టాక్ మార్కెట్ ఓ మంచి ఆప్షన్ అని.. మార్కెట్‌ను పూర్తిగా విశ్లేషించిన తర్వాత పెట్టుబడి పెట్టాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా స్థిరంగా డివిడెండ్లను అందించే పలు స్టాక్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు భవిష్యత్తు ప్రయోజనాలను అందిస్తాయని సూచిస్తున్నారు. ఈ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారులు ప్రతీ ఏటా 9 నుంచి 10 శాతం వరకు డివిడెండ్ ఆదాయాన్ని సులభంగా పొందవచ్చని.. ఇది స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటుందని చెబుతున్నారు. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే రాబడిని అందిస్తుందన్నారు. ఈ క్రమంలోనే మంచి డివిడెండ్లు అందించే స్టాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ఇది చదవండి: అప్పులు కాదు.. మీ ఇంటి నిండా డబ్బులే.! ఈ 8 సూత్రాలు పాటిస్తే మీరే కోటీశ్వరులు..
1. Balmer Lawrie: ఈ పీఎస్‌యూ కంపెనీ గత సంవత్సరం షేరుకు రూ. 4.30 డివిడెండ్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి2. Capital Investment Trust: ఈ షేర్ గత సంవత్సరం రూ. 26 డివిడెండ్ ఇచ్చింది.
3. PFC (Power Finance Corporation): ఇది గత సంవత్సరం షేరుకు రూ. 12 డివిడెండ్ ఇచ్చింది.
4. Trident Limited: ఈ కంపెనీ షేరు గత సంవత్సరం రూ. 11 డివిడెండ్ ఇచ్చింది.
5. IRB Infrastructure: ఇది గత సంవత్సరం షేరుకు రూ. 7.50 డివిడెండ్ ఇచ్చింది.
6. Dainik Jagran: గత సంవత్సరం షేరుకు రూ. 6 డివిడెండ్ ఇచ్చింది.
7. HUDCO: ఈ కంపెనీ గత సంవత్సరం షేరుకు రూ. 4 డివిడెండ్ ఇచ్చింది.
8. NMDC: గత సంవత్సరం షేరుకు రూ. 3.30 పైసలు డివిడెండ్ ఇచ్చింది.
ఉదాహరణకు రూ. 20 లక్షల ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో రూ. 10 లక్షలు ఇలాంటి డివిడెండ్ స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే, సంవత్సరానికి రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు డివిడెండ్ ఆదాయం పొందవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గమనిక: షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. నష్టాలకు టీవీ9 బాధ్యత వహించదు.
ఇది చదవండి: ‘ఆ సినిమా పూర్తయ్యాక.. తారక్.! నాలుగేళ్లు నీ మొహం ఇక చూపించకు అన్నాడు..’
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి