AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో నుంచి కొత్త బైక్.. కారు లాంటి స్మార్ట్ ఫీచర్స్‌తో సూపర్ మైలేజ్.. వావ్ అనకుండా ఉండలేరు..

LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను మార్పులు చేసి ప్యాషన్ XTEC మోడల్‌లో అందించారు. ఈ ఫీచర్లతో ఇది తన విభాగంలో మొదటి బైక్‌గా మార్కెట్‌లోకి రానుంది. పాత హాలోజన్ ల్యాంప్‌తో పోలిస్తే..

హీరో నుంచి కొత్త బైక్.. కారు లాంటి స్మార్ట్ ఫీచర్స్‌తో సూపర్ మైలేజ్.. వావ్ అనకుండా ఉండలేరు..
Hero Passion Xtec
Venkata Chari
|

Updated on: Jun 25, 2022 | 5:22 PM

Share

హీరో మోటోకార్ప్ కొత్త హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్‌ని విడుదల చేసింది. ఈ బైక్ అనేక అధునాతన ఫీచర్లు, సాంకేతికతతో వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. దీని డ్రమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,590లుకాగా, డిస్క్ వేరియంట్ ధర రూ.78,990గా ప్రకటించారు. ఈ బైక్‌పై కంపెనీ 5 సంవత్సరాల వారంటీ కూడా ఇస్తోంది. బైక్‌లో అతిపెద్ద మార్పు బ్లూటూత్ కనెక్టివిటీ అని కంపెనీ పేర్కొంది.

LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను మార్పులు చేసి ప్యాషన్ XTEC మోడల్‌లో అందించారు. ఈ ఫీచర్లతో ఇది తన విభాగంలో మొదటి బైక్‌గా మార్కెట్‌లోకి రానుంది. పాత హాలోజన్ ల్యాంప్‌తో పోలిస్తే హెడ్‌ల్యాంప్ యూనిట్ ఇప్పుడు 12% పొడవైన బీమ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఇది బైక్ విజువల్ అప్పీల్‌ను కూడా పెంచుతుంది. ఇది 3D బ్రాండింగ్, రిమ్ టేప్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఈ కాంతి వర్షం వంటి వాతావరణంలో మెరుగ్గా పనిచేస్తుంది.

కాల్, మెసేజ్ అలెర్ట్స్..

ఇవి కూడా చదవండి

బ్లూటూత్ కనెక్టివిటీ కన్సోల్ ఎంపిక కూడా బైక్‌లో అందుబాటులో ఉంటుంది. దీన్ని ఫోన్‌కి కనెక్ట్ చేసిన తర్వాత, రైడర్ పేరుతో ఫోన్ కాల్ అలర్ట్ లేదా మిస్డ్ కాల్‌తో SMS నోటిఫికేషన్ ఇస్తుంది. బైక్‌కి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా లభిస్తుంది. అంటే, ఇప్పుడు వినియోగదారులు బైక్ నడుపుతూ తమ స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయగలుగుతారు. మీటర్ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ స్థితిని కూడా చూపుతుంది. బైక్ సర్వీస్ రిమైండర్‌తోపాటు, ఇంధన అలెర్ట్‌ను కూడా మీటర్‌లో చూపిస్తుంది.

Hero Passion XTEC ఇంజిన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది మునుపటిలాగా 110cc BS6 ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 8 bhp శక్తిని, 9.79 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో దాదాపు 12 లీటర్ల ఇంధనం పట్టేందుకు ట్యాంక్ అందుబాటులో ఉంది. అదే సమయంలో, దీని మైలేజ్ 68.21kmplగా కంపెనీ పేర్కొంది. బైక్ ఇప్పుడు బ్లూ బ్యాక్‌లైట్‌కు సపోర్ట్ చేసే ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు బహుళ కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. ఈ సెగ్మెంట్‌లో ఈ బైక్ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుందని హీరో మోటోకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ తెలిపారు.