AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani: స్కూల్లో అంబానీ కొడుకును ఆటాడుకున్న స్టూడెంట్స్.. బికారివి నువ్వు అంటూ హేళన

అనంత్ అంబానీ తండ్రి ముఖేష్ అంబానీ దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. అంబానీ కుటుంబంలోని చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలో బిలియనీర్లు, బాలీవుడ్ ప్రముఖులు, స్టార్ క్రికెటర్లు, రాజకీయ నాయకులు కూడా కనిపించారు. అనంత్ అంబానీకి చెందిన అత్యంత ఖరీదైన గడియారాలు, బట్టలు, కార్లను సైతం ఎన్నో చూసి ఉంటారు. అనంతర వాచ్ మార్క్ జుకర్‌బర్గ్ భార్య దృష్టిని కూడా ఆకర్షించింది. అనంత్ అంబానీ పాఠశాలలో..

Anant Ambani: స్కూల్లో అంబానీ కొడుకును ఆటాడుకున్న స్టూడెంట్స్.. బికారివి నువ్వు అంటూ హేళన
Anant Ambani
Subhash Goud
|

Updated on: Mar 06, 2024 | 1:44 PM

Share

అనంత్ అంబానీ తండ్రి ముఖేష్ అంబానీ దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత సంపన్నుడు. అంబానీ కుటుంబంలోని చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలో బిలియనీర్లు, బాలీవుడ్ ప్రముఖులు, స్టార్ క్రికెటర్లు, రాజకీయ నాయకులు కూడా కనిపించారు. అనంత్ అంబానీకి చెందిన అత్యంత ఖరీదైన గడియారాలు, బట్టలు, కార్లను సైతం ఎన్నో చూసి ఉంటారు. అనంతర వాచ్ మార్క్ జుకర్‌బర్గ్ భార్య దృష్టిని కూడా ఆకర్షించింది. అనంత్ అంబానీ పాఠశాలలో చదువుతున్న సమయంలో అతని విద్యార్థులందరూ ‘బిచ్చగాడు’ అని పిలిచేవారు.

అనంత్ అంబానీ ముఖేష్ అంబానీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివారు. అక్కడ భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన చిన్న కుమారుడు. అతని పాఠశాల స్నేహితులు తరచూ, “తూ అంబానీ హై యా భిఖారీ !” అని చెప్పేవారట. ఎందుకంటే అతనికి పాకెట్ మనీగా కేవలం 5 రూపాయలు మాత్రమే ఇచ్చేవారట. ఒక పాత ఇంటర్వ్యూలో నీతా అంబానీ, అనంత్ మాత్రమే కాకుండా, తన ఇతర ఇద్దరు పిల్లలు ఆకాష్, ఇషాలకు ప్రతి వారం పాకెట్ మనీగా రూ.5 కేటాయించారని ఇచ్చేవారమని చెప్పుకొచ్చారు. ఎందుకంటే, అంబానీలు తమ పిల్లలు చిన్నప్పటి నుంచి డబ్బు విలువను నేర్చుకోవాలని, అందుకే 5 రూపాయలు మాత్రమే పాకెట్‌ మనీగా ఇచ్చేవారమని తెలిపారు. ఇక, అనంత్ అంబానీ స్కూల్ క్యాంటీన్‌కి వెళ్లి జేబులోంచి కేవలం రూ.5 మాత్రమే తీసి కొనుగోలు చేస్తే తోటి విద్యార్థులందరూ హేళన చేశారట.

అయితే స్కూళ్లో తనను హేళను చేస్తున్న విషయాన్ని అనంత్ వచ్చి ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు చెప్పినప్పుడు కొడుకు మాటలు విని పగలబడి నవ్వారు. భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో సభ్యులుగా ఉన్నప్పటికీ, ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలు వారి వినయపూర్వకమైన ప్రవర్తనకు ప్రసిద్ధిగా పేరుంది. చదువు పూర్తయిన తర్వాత అనంత్ అంబానీ ఉన్నత విద్య కోసం బ్రౌన్ యూనివర్సిటీకి వెళ్లారు. ఇప్పుడు అతను రిలయన్స్ 02C, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీకి డైరెక్టర్. వివిధ నివేదికల ప్రకారం.. అనంత అంబానీ నికర విలువ ప్రస్తుతం $4000 కోట్లకు పైగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో