Success Story: కోటీశ్వరుడిగా మారిన రైతు కూలి కథ ఇది.. ఏం చేశాడో తెలిస్తే షాక్ అయిపోతారు..
కాలం, అలలు ఎవరి కోసం ఆగవు.. ఎవరికీ ప్రత్యేకతలు చూపవు. వాటిని సద్వినియోగం చేసుకున్న వాడు పైకెళ్తాడు.. సరిగా వాడుకోలేని వాడు కిందే ఉండిపోతాడు. దీనికి సజీవ సాక్ష్యం ఈ రైతు. ఓ కూలీగా ప్రయాణం ప్రారంభించిన ఈయన ఇప్పుడు కోట్లు గడించే వ్యాపార సామ్రజ్యానికి అధిపతిగా మారాడు. ఆయనే మహారాష్ట్రకు చెందిన రవీంద్ర మణికర్ మెట్కర్.

జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే అంటారు కాలం, అలలు ఎవరి కోసం ఆగవు.. ఎవరికీ ప్రత్యేకతలు చూపవు. వాటిని సద్వినియోగం చేసుకున్న వాడు పైకెళ్తాడు.. సరిగా వాడుకోలేని వాడు కిందే ఉండిపోతాడు. దీనికి సజీవ సాక్ష్యం ఈ రైతు. ఓ కూలీగా ప్రయాణం ప్రారంభించిన ఈయన ఇప్పుడు కోట్లు గడించే వ్యాపార సామ్రజ్యానికి అధిపతిగా మారాడు. ఆయనే మహారాష్ట్రకు చెందిన రవీంద్ర మణికర్ మెట్కర్. పౌల్ట్రీ బిజినెస్ ద్వారా ఏటా రూ. 15కోట్లు గడిస్తూ అనేకమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన విజయ గాథను ఇప్పుడు తెలుసుకుందాం..
రూ. 5 కూలి నుంచి ప్రారంభం..
మహారాష్ట్ర లోని అమరావతి రైతులు ఒకప్పుడు రోజుకు కేవలం రూ.5 కూలిగా సంపాదించేవారు. బతకడానికి చాలా ఇబ్బందులు పడేవారు. వారిలో ఒకడైన రవీంద్ర మణికర్ మెట్కర్ తన విధిరాతను మార్చుకోవాలని అనుకున్నాడు. దానికోసం చాలా కష్ట బడ్డాడు. అనుకున్నది సాధించి ప్రస్తుతం ఆటోమెటిక్ పౌల్ట్రీఫారమ్ తో ముందుకు వచ్చాడు. దీని ధర రూ.20 కోట్లు. టర్నోవర్ కూడా కోట్లలోనే ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం 50 మంది పనిచేస్తున్నారు.
రవీంద్ర మెట్కర్ రైతుగా జీవితం ప్రారంభించాడు. నేడు రాష్ట్రంలోనే గుడ్ల ఉత్పత్తిలో అగ్రగామి అయ్యాడు. అతడి పౌల్ట్రీఫారమ్ నుంచి రోజుకు 200000 గుడ్లు ఉత్పత్తి అవుతాయి. 50 వే ల కోళ్ల కోసం రూ.18 కోట్లతో ఆటోమేటిక్ పౌల్ట్రీఫారమ్ నిర్మించాడు. అతడికి మరో 10,30,000 కోళ్లు కలిగిన మరో పౌల్ట్రీఫారమ్ ఉంది . మహారాష్ట్రతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు అక్కడి నుంచే గుడ్లు సరఫరా అవుతాయి. రైతులకు స్ఫూర్తి నిచ్చేలా ఉపన్యాసాలు ఇవ్వడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ అతడిని పిలుస్తోంది.
తండ్రి పీఎఫ్ డబ్బులతో..
రవీంద్ర తండ్రి చిరుద్యోగి. తన కుటుంబాన్ని పోషించడానికి ఆర్థిక ఇబ్బందులు పడేవాడు. దీంతో తండ్రికి సాయంగా, ఇంటి బాధ్యతలు మోయడానికి రవీంద్ర కోళ్ల పెంపకం చేపట్టాడు. అతడికి తండ్రి మద్దతుగా నిలిచాడు. ప్రావిడెంట్ ఫండ్ నుంచి రూ.30 వేలు తీసి రవీంద్రకు ఇచ్చాడు.
రవీంద్ర ఒక షెడ్డు వేసి వంద కోళ్లను పెంచడం ప్రారంభించాడు. ఆ సమయంలో షెడ్డు పైకి ఎక్కడానికి ఒక చెక్క నిచ్చెన మాత్రమే ఉండేది. కోళ్లు పెరగడంతో పెద్ద స్థలం అవసరమైంది. కానీ రవీంద్ర దగ్గర అంత డబ్బు లేదు. దీంతో తల్లి నుంచి వారసత్వంగా సంక్రమించిన పొలాన్ని రూ. 1,25,000కు అమ్మేశాడు. బ్యాంకు నుంచి రుణం తీసుకుని కోళ్ల పెంపకం మరింత పెంచాడు.
రవీంద్ర వ్యాపారం పెరిగింది. కోళ్ల నుంచి ఆదాయం బాగా వచ్చింది. బ్యాంకు రుణాన్ని తీర్చేశాడు. ఇటీవల మళ్లీ రుణం తీసుకుని 50 వేల కోళ్ల కోసం పౌల్ట్రీఫారమ్ కట్టాడు. ఇక్కడ 50 మంది పనిచేస్తున్నారు. కోళ్లకు రోజుకు రూ.4,00,000 ఖర్చు అవుతోంది. పౌల్ట్రీఫారమ్ వార్షిక టర్నోవర్ రూ.15 కోట్లు ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








