Credit Card: క్రెడిట్ కార్డు లిమిట్ తక్కువగా ఉంటే ఎంత నష్టమో తెలుసా? ఈ టిప్స్‌తో సులువుగా పెంచుకోవచ్చు.. ఓసారి ట్రై చేయండి..
కార్డు లిమిట్ ఎక్కువగా ఉంటే మీరు క్రెడిట్ కార్డును ఎక్కువగా వినియోగించుకోగలుగుతారు. అలాంటప్పుడు కార్డు లిమిట్ తక్కువగా ఉంటే ఎలా? సింపుల్ గా లిమిట్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? అలా పెంచుకోవడం లాభమా నష్టమా? అసలు బ్యాంకు నిర్ధేశించిన లిమిట్ పెంచుకోవడం సాధ్యమేనా? నిపుణులు చెబుతున్నది ఏంటి? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి..

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతి కార్డుకు నిర్దేశిత పరిమితి ఉంటుంది. ఆ పరిమితి లోపే మీరు కార్డును వినియోగించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కార్డులో ఈ లిమిట్ వ్యక్తులను బట్టి మారుతుంటుంది. వారి శాలరీ, బ్యాంకు ఖాతా వినియోగం వంటి అంశాలపై ఆధారపడి బ్యాంకులు కార్డు దారులకు లిమిట్ ను విధిస్తాయి. అయితే లిమిట్ తక్కువ గా ఉంటే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే కార్డు లిమిట్ ఎంత ఉన్నా ఆ కార్డుపై మొత్తం లిమిట్ వాడకూడదు. అలా వాడితే సిబిల్ స్కోర్ పై ప్రభావం పడుతుంది. సిబిల్ స్కోర్ మంచిగా మెయింటేన్ అవ్వాలంటే మీ కార్డు లిమిట్ లో కేవలం 50శాతంలోపు మాత్రమే వినియోగించుకోవాలి. అలా చేయాలంటే కార్డు లిమిట్ ఎక్కువగా ఉంటే మీరు క్రెడిట్ కార్డును ఎక్కువగా వినియోగించుకోగలుగుతారు. అలాంటప్పుడు కార్డు లిమిట్ తక్కువగా ఉంటే కార్డు లిమిట్ పెంచుకోవడం ఎలా? సింపుల్ గా లిమిట్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? అలా పెంచుకోవడం లాభమా నష్టమా? అసలు బ్యాంకు నిర్ధేశించిన లిమిట్ పెంచుకోవడం సాధ్యమేనా? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..
క్రెడిట్ కార్డు లిమిట్ ఎలా పెంచుకోవాలి?
- క్రెడిట్ కార్డ్ పరిమితిని కొన్ని సరళమైన పద్ధతుల ద్వారా పెంచుకోవచ్చు. మీ కార్డ్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించడం, సకాలంలో పూర్తి బిల్లు చెల్లింపులు చేస్తే ఉంటే మీ బ్యాంక్ ఆటోమేటిక్ గా కార్డు లిమిట్ ని పెంచుతుంది.
- మీ ఆదాయం పెరిగినా కూడా కార్డు లిమిట్ పెరిగే అవకాశం ఉంటుంది. మీ బ్యాంక్‌కి పేస్లిప్‌ల వంటి అప్‌డేట్ చేయబడిన ఆదాయ రుజువులను అందిస్తే బ్యాంకులు కార్డు లిమిట్ ను పెంచుతాయి.
- అలాగే అధిక పరిమితిని అందించే కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీర్ఘకాలిక కార్డ్ హోల్డర్లకు బ్యాంకులే లిమిట్ ను పెంచుతాయి.
కార్డు లిమిట్ పెంచుకుంటే ప్రయోజనాలేంటి?
క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడం.. కార్డు లిమిట్ ఎక్కువగా ఉంటే క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. కార్డ్ హోల్డర్లు తమ ఖర్చును స్థిరంగా ఉంచుతూ వారి పరిమితిని పెంచుకుంటే.. అందుబాటులో ఉన్న క్రెడిట్‌కు వారి నిష్పత్తి తగ్గుతుంది. ఇది క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది. ఆర్థిక సంస్థలకు వారి విశ్వసనీయత, సకాలంలో తిరిగి చెల్లించే అవకాశాలను వివరిస్తుంది.
నిర్వహణ సులభతరం.. బహుళ కార్డ్‌లను నిర్వహించడం ఒక సవాలుతో కూడుకున్న పని. అధిక పరిమితి ఉన్న ఒకే క్రెడిట్ కార్డ్ కార్డ్ కార్యకలాపాల ట్రాకింగ్‌ను సులభతరం చేస్తుంది. వ్యయ ప్రణాళికను క్రమబద్ధీకరించవచ్చు. అదే సమయంలో, అధిక క్రెడిట్ పరిమితులు ఉన్న వ్యక్తులు బ్యాంకులతో ఆధారపడదగిన వారిగా పరిగణించబడతారు. తద్వారా వారికి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తారు.
ఎక్కువ రివార్డులు.. క్రెడిట్ కార్డుతో ఎక్కువగా ఖర్చు చేస్తే రివార్డులు ఎక్కువ వస్తాయి. అలాగే బిల్లులను పూర్తిగా, సమయానికి చెల్లించడంలో శ్రద్ధ చూపే వారు మరిన్ని రివార్డ్‌లను పొందవచ్చు. బ్యాంకులు తరచుగా అధిక పరిమితి కార్డ్ హోల్డర్‌లను విలువైన కస్టమర్‌లుగా పరిగణిస్తాయి. అదనపు రివార్డ్ పాయింట్‌లు, ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రివార్డ్‌లు విమాన టెకెట్లు, ఆన్ లైన్ కొనుగోళ్లలో ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లను అందిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..