SBI Investment Schemes: ఒక్కసారే పెట్టుబడి పెట్టండి.. నెలనెలా ఆదాయం పొందండి.. ఎస్బీఐ బెస్ట్ స్కీమ్ ఇదే..
ఒకేసారి పెట్టుబడి పెట్టి నెల నెలా ఆదాయం కోరుకునే వారికి మరో సూపర్ స్కీమ్ ను ఎస్బీఐ ప్రకటించింది. దాని పేరు ఎస్బీఐ యాన్యూటీ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి, నెలనెలా ఆదాయాన్ని పొందొచ్చు. వృద్ధులకు పెన్షన్ వచ్చినట్లు ఇది వస్తుంది. ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంచుకొనే బదులు.. ఇలాంటి పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అసలుతో పాటు వడ్డీని పొందొచ్చు.

మన దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు మంచి పేరుంది. అతి పెద్ద రుణదాతగా వినియోగదారుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంటుంది. అందుకనుగుణంగానే బ్యాంక్ వినియోగదారులకు వివిధ రకాల సేవలు, సదుపాయాలను కల్పిస్తుంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన సౌకర్యాలను అందిస్తుంది. అధిక ప్రయోజనాలతో కూడిన పథకాలను సైతం అందిస్తుంటుంది. సేవింగ్స్, కరెంట్ ఖాతాలతో పాటు పలు రకాల లోన్లు కూడా మంజూరు చేస్తుంటుంది. అదే విధంగా అనేక రకాల పెట్టుబడి పథకాలు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతోంది. ఫిక్స్ డ్ డిపాజిట్ వంటి సురక్షిత పెట్టుబడి పథకాలకు అధి ప్రాధాన్యం ఇస్తుంది. దాంతో పాటు ఒకేసారి పెట్టుబడి పెట్టి నెల నెలా ఆదాయం కోరుకునే వారికి మరో సూపర్ స్కీమ్ ను ఎస్బీఐ ప్రకటించింది. దాని పేరు ఎస్బీఐ యాన్యూటీ డిపాజిట్ స్కీమ్. ఈ పథకంలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి, నెలనెలా ఆదాయాన్ని పొందొచ్చు. వృద్ధులకు పెన్షన్ వచ్చినట్లు ఇది వస్తుంది. ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంచుకొనే బదులు.. ఇలాంటి పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అసలుతో పాటు వడ్డీని పొందొచ్చు. ఈ ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్ వివరాలు ఇవి..
నెలవారీ వాయిదాల్లో.. ఎస్బీఐ అందిస్తున్న పెట్టుబడి పథకాలలో ఇది కూడా ఒకటి. దీనిలో ఒకేసారి పెట్టుబడి పెట్టి.. నెల నెలా నగదు తీసుకుంటూ ఉండొచ్చు. దీనిలో అసలుతో పాటు వడ్డీ కూడా కలిపి ఇస్తారు. మీరు ఒకేసారి చెల్లించిన మొత్తం నగదులో కొత్త భాగంతో పాటు మొత్తంపై వచ్చిన వడ్డీని కలిపి మీకు ప్రతి నెలా పింఛన్ మాదిరిగా ఇస్తారు.
టెన్యూర్స్ ఇలా.. ఈ పథకం వివిధ టెన్యూర్స్ లో అందుబాటులో ఉంది. మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాల వ్యవధుల్లో ఈ పథకం అందుబాటులో ఉంది.
వడ్డీరేటు ఇలా.. ఈ ఎస్బీఐ యాన్యుటి స్కీమ్ లో వడ్డీ రేట్లు ఇదే టెన్యూర్స్ తో కూడిన టెర్మ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీతో సమానంగా ఉంటాయి. వాటిల్లో లాగే సీనియర్ సిటిజెన్స్ కు ఈ పథకంలో కూడా ఎక్కువ వడ్డీనే అందిస్తారు. ఉదాహరణకు మీరు ఈ ఖాతాలో రూ. 5లక్షలు జమచేశారనుకోండి.. అదికూడా ఐదేళ్ల కాలపరిమితితో చేశారనుకుంటే.. మీకు దీనిపై 6.5శాతం వడ్డీ వస్తుంది. దీని ప్రకారం మీరు నెలనెలా దాదాపు రూ. 9,750 వస్తుంది. దీనిలో రూ. 2,710 వడ్డీ కాగా.. మిగిలిన మొత్తం మీ డిపాజిట్ నుంచి చెల్లిస్తారు. ఐదేళ్ల కాలంలో మీరు డిపాజిట్ చేసిన మొత్తంతో పాటు వడ్డీకూడా చెల్లించేస్తారు.
కనీస పెట్టుబడి.. ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే కనీసం నెలకు మీకు రూ. 1000 యాన్యుటీ వచ్చేలా మీరు ఏడాదికి సరిపడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు డిపాజిట్ చేయాల్సిన కనీస మొత్తం రూ. 24,000 ఉంటుంది. 7 నుంచి 45 రోజుల వ్యవధితో పాటు ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకూ టెన్యూర్స్ తో మీరు డిపాజిట్ చేయొచ్చు. ప్రతి నెలా వచ్చే నగదు మీకు సంబంధించిన సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు.
అర్హత.. మన దేశ పౌరులు ఎవరైనా ఈ ఖాతా ప్రారంభించవచ్చు. మైనర్ల పేరు మీద సంరక్షకులు ఖాతా తెరవొచ్చు. ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ వినియోగదారులకు మాత్రం దీనిలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేదు.
ఇతర ఫీచర్లు ఇవి.. ఈ ఖాతాను ఏ బ్రాంచ్ కైనా బదిలీ చేసుకోవచ్చు. నామినీ సదుపాయం ఉంటుంది. కానీ వ్యక్తిగత ఖాతాలు ఉన్న వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు ఈ సదుపాయం ఉండదు. మీరు డిపాజిట్ చేసిన మొత్తం నుంచి ప్రతి నెలా యాన్యుటీ తీసుకుంటూనే మిగిలిన మొత్తం 75శాతం వరకూ లోన్ సదుపాయం ఉంటుంది. దానికి మీరు నెలనెలా చెల్లింపుచేయాల్సి ఉంటుంది. అలాగే మీరు డిపాజిట్ ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. కానీ రూ. 15లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








