Electric Scooter: సింగిల్ చార్జ్ పై 100 కిమీ.. ధర కూడా తక్కువే.. సిటీ పరిధికి అనువైన స్కూటర్..
మార్కెట్లో ప్రతి రోజూ ఏదో ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ లాంచ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఈవీట్రిక్(Evtric) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంప్రదాయ ఇంధన వాహనాలకు దీటుగా విద్యుత్ శ్రేణి వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా ప్రజలు ప్రత్యామ్నాయం వైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహన తయారీ దారులు తమ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్ లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త బైక్ లాంచ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఈవీట్రిక్(Evtric) అనే స్కూటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు దీనిని ఎందుకు కొనుగోలు చేయాలి? దీని ప్రత్యేకత ఏంటి? ఫీచర్లు ఏంటి? చూద్దాం రండి..
సామర్థ్యం.. దీనిలో 48V, 39Ah సామర్థ్యం కలిగిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని 0 నుంచి 80 శాతం చార్జ్ చేయడానికి 3.5 గంటల సమయం పడుతుంది. దీనిలో 250 వాట్ల సామర్థ్యంతో కూడిన మోటార్ ఉంది.
రేంజ్, టాప్ స్పీడ్.. దీనిలోని బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లగలుగుతుంది.
బ్రేకింగ్, సస్పెన్షన్.. ఈ స్కూటర్ ఫ్రంట్ వీల్ కి డిస్క్ బ్రేక్ ఉంటుంది. వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. అలాగే ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్ సిస్టమ్ అమర్చారు.
ఫీచర్లు.. దీనిలో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ స్పీడో మీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, పుష్ బటన్ స్టార్ట్, సైడ్ స్టాండ్ సెన్సార్, చార్జింగ్ పోర్టు, డిజిటల్ ఫ్యూయల్ గేజ్, ఎల్ఈడీ హెడ్ లైట్, టెయిల్ ల్యాంప్, టర్న్ లైట్లు ఉంటాయి.
ధర.. ఈ ఈవీట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 94,733(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..