Telangana: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్నల్ మార్కుల విధానం ఉండదని చెప్పింది. పబ్లిక్ ఎగ్జామ్స్ 100 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి విద్యా శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తివేసింది. ఇకపై పదో తగరతి పరీక్షలు వంద మార్కులకు నిర్వహించనున్నారు. ఇంటర్నల్ మార్కుల అసవరం లేదని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలోనే ఇంటర్నల్ మార్కులను తీసివేయాలని ప్రభుత్వం ఆలోచించింది. దీంతో ఈసారి ఇంటర్నల్ మార్కుల విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఇకపై పదో తరగతి పరీక్షలు 100 మార్కులకు జరగనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పదో తరగతి పరీక్షల విషయంలో ఇంటర్నల్, ఎక్స్‌ట్రనల్ మార్కుల విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మొత్తం 100 మార్కులకు గాను 20 శాతం మార్కులు స్కూల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా టీచర్లు వేసేవారు. మిగతా 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించే వారు. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..