Allu Arjun: పుష్ప 2 రిలీజ్‌కు ముందు బన్నీ స్పెషల్ వీడియో.. నెట్టింట వైరల్!
పుష్ప సినిమా సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం అల్లు అర్జున్ స్పెషల్ వీడియో చేశారు. తన x ఖాతాలో షార్ట్ వీడియో పోస్ట్ చేశారు అల్లు అర్జున్. అయితే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా..
పుష్ప సినిమా సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం అల్లు అర్జున్ స్పెషల్ వీడియో చేశారు. తన x ఖాతాలో షార్ట్ వీడియో పోస్ట్ చేశారు అల్లు అర్జున్. అయితే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. యాంటి నార్కోటిక్ టీం కు సహరిస్తూ స్పెషల్ విడియో పోస్ట్ చేశారు బన్నీ. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కాల్ చేయాలని కూడా అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు.
మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్: 1908కు ఫోన్ చేయాలని కోరారు. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవన విధానంలోకి వచ్చే విధంగా చేస్తారని తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు.. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం.. అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గతంలో కూడా చిరంజీవి, జూ.ఎన్టీఆర్ కూడా ఈ విధంగా వీడియోల ద్వారా అవగాహన కల్పించారు.