Best saving schemes: ఆ పొదుపు పథకాల్లో అదిరే వడ్డీ.. ఇక పెట్టుబడిదారులకు పండగే..!

ప్రభుత్వం అమలు చేసే పొదుపు పథకాలను ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తారు. ఎలాంటి రిస్క్ లేకుండా రాబడిని పొందాలనుకునేవారికి ఇవి మొదటి ఎంపికగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని వర్గాల వారీ కోసం వివిధ పథకాలు అమల్లో ఉన్నాయి. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలకు నిర్ణీత కాలానికి వడ్డీని అందజేస్తారు.

Best saving schemes: ఆ పొదుపు పథకాల్లో అదిరే వడ్డీ.. ఇక పెట్టుబడిదారులకు పండగే..!
Small Saving Schemes
Follow us
Srinu

|

Updated on: Nov 28, 2024 | 4:30 PM

బాలికల కోసం సుకన్య యోజన, మహిళలకు మహిళా సమ్మాన్, సీనియర్ సిటిజన్లకు సేవింగ్స్ స్కీమ్, దీర్ఘకాలిక పెట్టుబడి దారుల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసార్ వికాస పత్ర తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిపై 7.5 శాతం నుంచి 8.2 శాతం వరకూ వడ్డీని అందిస్తున్నారు. ఒక ఆర్థిక సంవత్సరాన్ని నాలుగు త్రైమాసికాలుగా విభజించి ప్రభుత్వం వివిధ పథకాలపై వడ్డీ రేటును సమీక్షిస్తుంది. ప్రస్తుతం అక్టోబర్ ఒకటిన ప్రారంభమైన మూడో త్రైమాసికం డిసెంబర్ లో ముగుస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం మూడో త్రైమాసికంగా వడ్డీరేటులో మార్పు చేయలేదు. ఈ నేపథ్యంలో 8.2 శాతం వరకూ వడ్డీరేటు అందించే పథకాల వివరాలు తెలుసుకుందాం.

ఎస్సీఎస్ఎస్

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) ద్వారా సీనియర్ సిటిజన్లు, విశ్రాంత ఉద్యోగులు స్థిరమైన రాబడి పొందుతారు. ఈ పథకంలో కనీసం వెయ్యి రూపాయల నుంచి రూ.30 లక్షల వరకూ డిపాజిట్ చేయవచ్చు. దీనిపై ఏడాదికి 8.2 శాతం వడ్డీని అందిస్తారు. మూడో త్రైమాసికంలోనూ ఈ రేటు మారలేదు.

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్

పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పథకం కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. దీనిలో కనీసం వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయవచ్చు. దీనిపై 7.5 శాతం వడ్డీని అందిస్తున్నారు. అలాగే డిపాజిట్ కు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)కి మూడో త్రైమాసికంలో 7.7 శాతం వడ్డీని అందిస్తున్నారు. దీని ద్వారా స్థిరమైన రాబడితో పాటు ఆదాయపు పన్ను ప్రయోజనాలు కలుగుతాయి. డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఈ ప్రభుత్వ ఆధారిత పొదుపు పథకం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)

కేవీపీలో పెట్టిన పెట్టుబడి 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలలకు రెట్టింపు అవుతుంది. ఈ త్రైమాసికంలో ఈ పథకానికి 7.5 శాతం వడ్డీని అమలు చేస్తున్నారు. హమీతో కూడిన రాబడి, స్థిరమైన వడ్డీని అందించే తక్కువ రిస్క్ కలిగిన పెట్టబడి పథకం ఇది.

మహిళా సమ్మాన్ సర్టిఫికెట్

మహిళల అభ్యున్నతి కోసం కేంద్రప్రభుత్వం ఏడాది క్రితం ఈ పథకాన్ని అమలు చేసింది. దీనిలో గరిష్టంగా రూ.2 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు, రెండేళ్ల తర్వాత వడ్డీతో కలిపి అందజేస్తారు. మహిళు తన పేరుమీద, తమ మైనర్ బాలిక పేరు మీద ఖాతా తెరుచుకోవచ్చు. 2025 మార్చి వరకూ మాత్రమే అవకాశం ఉంటుంది. దీనిపై ఏడాదికి 7.5 శాతం వడ్డీని అందిస్తున్నారు.

సుకన్య యోజన

బాలికల భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. పదేళ్ల లోపు వయసున్న బాలికల పేరు మీద తల్లిదండ్రులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. దీనిలో డిపాజిట్లకు ఆదాయపు పన్ను శాఖ మినహాయింపు లభిస్తుంది. మూడో త్రైమాసికంలో ఈ పథకానికి 8.2 శాతం వడ్డీని అమలు చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
ప్రాణం కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పిన కోతుల గుంపు.! వీడియో..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
గోదావరి నదిలో మొసలి కలకలం.! అదిరిపడ్డ పశువుల కాపరి..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..