Home Loan: హోమ్‌లోన్ తీసుకుంటున్నారా..? ఆ అంశాల్లో జాగ్రత్తలు మస్ట్

సొంతింటిని సమకూర్చుకోవడం ప్రతి ఒక్కరి కల. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరిన వారందరూ మొదటి ప్రాధాన్యం ఇంటికే ఇస్తారు. మీ ఆర్థిక క్రమశిక్షణకు సొంతిల్లు నిదర్శనంగా నిలుస్తుంది. మీకు సమాజంలో గుర్తింపు నిస్తుంది.

Home Loan: హోమ్‌లోన్ తీసుకుంటున్నారా..? ఆ అంశాల్లో జాగ్రత్తలు మస్ట్
Home Loan
Follow us
Srinu

|

Updated on: Nov 28, 2024 | 4:12 PM

ఉద్యోగం చేస్తూ నిర్ణీత ఆదాయం సంపాదిస్తున్న వారికి నిబంధనల మేరకు బ్యాంకులు హౌసింగ్ రుణం ఇస్తాయి. దానితో ఇంటిని కొనుగోలు చేసుకుని, ఈఎంఐల రూపంలో బ్యాంకులకు వాయిదాలు చెల్లించవచ్చు. అయితే రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వివిధ అంశాలను పరిశీలిస్తాయి. ఉదాహరణకు రూ.కోటి రూపాయలు విలువైన ఇంటిని కొనుగోలు చేయాలనుకున్నారనుకోండి. దానికి బ్యాంకు ఎంత రుణం ఇస్తుంది. నెలవారీ ఈఎంఐ ఎంత పడుతుంది. మీకు ఎం జీతం వస్తే బ్యాంకు రుణం మంజూరు చేస్తుందో తెలుసుకుందాం.

మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఇంటి విలువ కోటి రూపాయలు. అయితే ఆస్తి విలువలో 80 శాతం మాత్రమే బ్యాంకులు మంజూరు చేస్తాయి. అంటే రూ.80 లక్షలు రుణం ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన రూ.20 లక్షలను మీరే సమకూర్చుకోవాలి. దీన్నే డౌన్ పేమెంట్ అంటారు. హౌసింగ్ రుణాలను ఈఎంఐల కాలవ్యవధి చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు 30 ఏళ్లు అనుకోండి. 360 నెలల పాటు వాయిదాలు కట్టాల్సి ఉంటుంది. సాధారణంగా హౌసింగ్ రుణాలపై వడ్డీ 8.5 శాతం ఉంటుంది. అయితే మార్కెట్ పరిస్థితుల ఆధారంగొ కొంచెం అటూ ఇటూ మారవచ్చు.

బ్యాంకు నుంచి తీసుకున్న రూ.80 లక్షలకు వడ్డీతో కలిపి 30 ఏళ్లకు లెక్కిస్తే.. నెలకు రూ.61,500 చొప్పున 360 నెలలు కట్టాల్సి ఉంటుంది. అయితే బ్యాంకుల లెక్కల ప్రకారం మీరు కట్టే నెలవారీ వాయిదా సొమ్ము మీ జీతంలో 40 శాతానికి మించి ఉండకూడదు. దాని ప్రకారం మీరు ప్రతినెలా రూ.1.53,750 సంపాదిస్తూ ఉండాలి. అంత ఆదాయం ఉంటే మీరు ఈఎంఐలు సక్రమంగా కట్టగలరని బ్యాంకు భావిస్తుంది.

ఇవి కూడా చదవండి

బ్యాంకు ఇచ్చిన రుణమే కాకుండా ఇతర ఖర్చుల కోసం మీ దగ్గర కొంత సొమ్ము ఉండాలి. ముఖ్యంగా డౌన్ పేమెంట్ చూసుకోవాలి. అది దాదాపు రూ.20 లక్షలు అవసరం. అలాగే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు ఆస్తి విలువలో 6 నుంచి 8 శాతం ఉంటాయి. కోటి రూపాయలతో ఇల్లు కొంటున్నారు కాబట్టి దాదాపు 6 నుంచి 8 లక్షలు ఈ ఖర్చుకు పక్కన పెట్టాలి. ఇంకా ఇంటిరియర్స్, నిర్వహణ ఖర్చులు అదనంగా ఉంటాయి. కాబట్టి ఇల్లు కొనుగోలు చేయడానికి అయ్యే ఖర్చులు ఈ విధంగా ఉంటాయి.

హోమ్‌లోన్ లెక్కింపు ఇలా

  • ఇంటి విలువ రూ.కోటి రూపాయలు
  • బ్యాంకు ఇచ్చే రుణం రూ.80 లక్షలు
  • డౌన్ పేమెంట్ రూ.20 లక్షలు
  • నెలవారీ కట్టాల్సిన ఈఎంఐ రూ.61,500
  • ఈఎంఐల కాలవ్యవధి 360 నెలలు
  • మీరు సంపాదించిల్సిన ఆదాయం నెలకు రూ.1.53,750
  •  రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఖర్చులు దాదాపు రూ.8 లక్షలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?