Vastu Tips: మీ ఇల్లు వాస్తు ప్రకారమే ఉందా.? ఈ పాయింట్స్‌ చెక్‌ చేసుకోండి..

ఇంటి నిర్మాణం విషయంలో వాస్తును కచ్చితంగా ఫాలో అవ్వాలని పండితులు చెబుతుంటారు. అయితే మనకు తెలిసో తెలియకో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. మరి ఇంతకీ మీ ఇల్లు వాస్తుకు అనుగుణంగానే ఉందా.? ఏవైనా లోపాలు ఉన్నాయా.? ఈ సింపుల్ పాయింట్స్ తో చెక్ చేసుకోండి..

Vastu Tips: మీ ఇల్లు వాస్తు ప్రకారమే ఉందా.? ఈ పాయింట్స్‌ చెక్‌ చేసుకోండి..
Vastu
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 28, 2024 | 3:40 PM

ఇంటి నిర్మాణం వాస్తుకు అనుగుణంగా ఉండాలని చాలా మంది విశ్వసిస్తారు. హిందువులు వాస్తును బాగా నమ్ముతారు. అందుకే ఇంటి నిర్మాణం అనే ఆలోచన రాగానే వెంటనే వాస్తు పండితులను సంప్రదిస్తుంటారు. పండితుల సూచనల మేరకే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. అయితే ఎన్ని సూచనలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో వాస్తు దోషాలు ఏర్పడడం సర్వసాధారణం. కానీ కచ్చితంగా ప్రతీ ఇల్లు కొన్ని వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ ఆ బేసిక్‌ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఈశాన్యంలో ఎట్టి పరిస్థితుల్లో మెట్లు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈశాన్యం దిశ ఖాళీగానే ఉండాలి. మెట్లు తూర్పు నుంచి పడమరకు కానీ, ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు కానీ ఎక్కేవిధంగా ఉండాలి.

* ఇక మెట్లు కచ్చితంగా బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. మెట్లు ఎక్కేప్పుడు కుడి పాదం మొదలు పెడితే.. ఫ్లోర్‌కి చేరుకునే సమయంలో మొదట కుడిపాదమే పెట్టేలా ఉండాలి.

* ఇటీవల చాలా మంది రూమ్‌ సీలింగ్‌ అందంగా కనిపించాలనే ఉద్దేశంతో రకరకాల డిజైన్స్‌ చేస్తున్నారు. అయితే సీలింగ్‌కు ఐదు కార్నర్‌లు ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఇంటికి వచ్చిన అతిథులు వాయువ్యం వైపు ఉన్న రూమ్‌లో కూర్చోవాలి.

* బెడ్‌రూమ్‌ నైరుతి దిశలోనే ఉండేలా చూసుకోవాలి. పొరపాటున కూడా ఆగ్నేయంలో ఉండకూడదు. ఆగ్నేయంలో బెడ్ రూమ్‌ ఉంటే దంపతుల మధ్య గొడవలు జరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

* సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలుకావడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మెయిన్‌ డోర్‌కు ఒకవైపుగా మెట్లు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

* ఇంటికి రెండు చివర్ల ఉండే తలుపులు సమానంగా ఉండాలి. అలాగే సింహ ద్వారానికి ఉన్న తలుపు కుడివైపు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా సింగిల్‌ డోర్‌ కుడివైపు తెరుచుకునేలా చూసుకోవాలి.

* కిటికిల విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఎల్లప్పుడూ కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఉండేలా చూసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..