AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MG Cyberster: అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. మూడు సెకండ్లలోనే 100 కి.మీ.ల వేగం..

అతి తక్కువ ధరలో స్పోర్ట్స్‌ లుక్లో కనిపిస్తున్న ఈ కారును జేఎస్‌డబ్ల్యూ, ఎంజీ సంయుక్తంగా తయారు చేశాయి. అది కూడా ఎలక్ట్రిక్ వేరియంట్లో. ఈ స్పోర్ట్స్ కారు పేరు ఎంజీ సైబర్ స్టర్. ఈ కారు తన సూపర్‌ పవర్‌ను చాటి చెబుతుందని జేఎస్‌బ్ల్యూ-ఎంజీ ప్రకటించింది. ఈ కారును మొదటిసారిగా 2021లోనే ప్రకటించారు. అనేక పరీక్షల అనంతరం దీనిని ప్రదర్శించారు.

MG Cyberster: అతి తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్.. మూడు సెకండ్లలోనే 100 కి.మీ.ల వేగం..
Mg Cyberster Electric Sports Car
Madhu
|

Updated on: Mar 24, 2024 | 6:24 AM

Share

స్పోర్ట్స్ కారంటే చూడటానికే కానీ కొనడానికి కాదు అని నానుడి. ఎందుకంటే వాటి ధరలు అంత ఎక్కువ ఉంటాయి. సాధారణ ప్రజలు వాటిని కొనుగోలు చేయాలంటే అయ్యే పనికాదు. సంపన్నులు, మిలీయనీర్లు మాత్రమే కొనుగోలు చేయగలుగుతారు. అయితే క్రమంగా పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు అందుబాటు ధరలోనే స్పోర్ట్స్ కారు కూడా మార్కెట్లోకి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. అతి తక్కువ ధరలో స్పోర్ట్స్‌ లుక్లో కనిపిస్తున్న ఈ కారును జేఎస్‌డబ్ల్యూ, ఎంజీ సంయుక్తంగా తయారు చేశాయి. అది కూడా ఎలక్ట్రిక్ వేరియంట్లో. ఈ స్పోర్ట్స్ కారు పేరు ఎంజీ సైబర్ స్టర్. ఈ కారు తన సూపర్‌ పవర్‌ను చాటి చెబుతుందని జేఎస్‌బ్ల్యూ-ఎంజీ ప్రకటించింది. ఈ కారును మొదటిసారిగా 2021లోనే ప్రకటించారు. అనేక పరీక్షల అనంతరం దీనిని ప్రదర్శించారు. 2024 చివరి నాటికి దీనిని చైనీస్, యూరోపియన్ మార్కెట్లలో విక్రయించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎంజీ సైబర్ స్టర్ డిజైన్..

ఎంజీ సైబర్ స్టర్ కారు 2017లో వచ్చిన ఈ-మోషన్ కూపే కాన్సెప్ట్ ఆధారంగా తయారు చేశారు. డిజైన్ పరంగా ఈ కారు డీఆర్ఎల్ లతో కూడిన సొగసైన ఎల్ఈడీ హెడ్లైట్లు, కింద ఎయిర్ ఇన్ లను కలిగి ఉంది. వెనుక భాగంలో ఇది బాణం- ఆకారపు టెయిల్ లైట్లు, స్ప్రిట్ రియర్ డిఫ్యూజర్ను పొందుతుంది. 19 నుంచి 20 అంగుళాల వరకు డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది. ఈ ఈవీ పొడవు 4,533ఎంఎం, వెడల్పు 1,912 ఎంఎం, ఎత్తు 1,328ఎంఎం, 2,689 వీల్ బేస్ ను కలిగి ఉంది.

ఎంజీ సైబర్ స్టర్ ఇంటీరియర్..

సైబర్టర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం మూడు స్క్రీన్లను కలిగి ఉంటుంది. ఇందులో నిలువుగా పేర్చబడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డ్రైవర్ వైపు ఉంటుంది. ఇక ఫీచర్లలో విషయానికి వస్తే వైర్లెస్ యాపిల్ కార్ ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, ఇన్ బిల్ట్ 5జీ సిమ్, కార్ టెక్, వైర్ లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, మల్టిపుల్ డ్రైవ్ మోడ్లు, ప్రీమియం బోస్ ఆడియో సిస్టమ్, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8155 చిప్, రీజెనరేటివ్ బ్రేకింగ్, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, లెవల్-2 అడాస్ వంటి ఫీచర్లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఎంజీ సైబర్ స్టర్ స్పెసిఫికేషన్లు..

బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ గురించి చూస్తే, సైబర్ స్టర్ రెండు బ్యాటరీ ప్యాక్లు, మోటారు ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ-లెవల్ మోడల్ 64కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 308 హెచ్పీ వెనుక యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 520కిలోమీటర్ల రేంజ్ ను ఇస్తుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేయబడిన పెద్ద 77కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్ను కూడా పొందుతుంది. ఇది కలిపి 535హెచ్పీ, 725ఎన్ఎం గరిష్ట టార్క్ ను అందిస్తుంది. ఇది 580కిమీల పరిధిని అందిస్తుంది.

ఎంజీ సైబర్ స్టర్ లాంచ్, ధర..

ఎంజీ సైబర్ స్టర్ స్పోర్ట్స్ కారు 2024 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని ధర 50,000 యాన్లు ఉండే అవకాశం ఉంది. అంటే మన కరెన్సీ రూ. 53లక్షలు ఉంటుంది. ఈ కారు కేవలం 3.2 సెకన్లలో 0-100 కిమీ వేగంతో దూసుకుపోగలుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్