Revolt RV400: ఎలక్ట్రిక్ బైక్‌లలో గేమ్ ఛేంజర్ ఈ బైక్.. కిర్రాక్ లుక్.. ఖతర్నాక్ ఫీచర్స్.. పూర్తి వివరాలు
రివల్యూషనరీ డిజైన్, ఫీచర్లతో రివోల్ట్ ఆర్వీ400 పేరిట ఓ కొత్త బైక్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. వాస్తవానికి ఇది 10 నెలల క్రితమే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే వేల సంఖ్యలో బైక్ లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు దీనిని మరింతగా మార్కెటింగ్ చేసి, విక్రయాలుపెంచుకునేందుకు కంపెనీ ప్రణాళిక చేసింది.

మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. పర్యావరణ హితమైన ఈ వాహనాలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. లోకల్ అవసరాలకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రివల్యూషనరీ డిజైన్, ఫీచర్లతో రివోల్ట్ ఆర్వీ400 పేరిట ఓ కొత్త బైక్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. వాస్తవానికి ఇది 10 నెలల క్రితమే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే వేల సంఖ్యలో బైక్ లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు దీనిని మరింతగా మార్కెటింగ్ చేసి, విక్రయాలుపెంచుకునేందుకు కంపెనీ ప్రణాళిక చేసింది. ఈ నేపథ్యంలో మన భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ బైక్ గా నిలిచిన ఈ రివోల్ట్ ఆర్వీ400 బైక్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
రివోల్ట్ ఆర్వీ400 ఇంజిన్ సామర్థ్యం.. ఈ బైక్ లో 3000-వాట్ మోటార్‌ను కలిగి ఉంది, ఇది థ్రిల్లింగ్, శక్తివంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ సింగిల్ చార్జ్ పై 150 కిమీల పరిధిని అందిస్తుంది. దీనిలో 4kWh లిథియం-అయాన్ ఎలక్ట్రిక్ బ్యాటరీ ఉంది. ఇది నమ్మదగిన, శాశ్వతమైన పనితీరును అందిస్తుంది.
రివోల్ట్ ఆర్వీ400 ఫీచర్లు.. స్పీడ్ ఔత్సాహికులు రివోల్ట్ ఆర్వీ400 ఎలక్ట్రిక్ బైక్ మంచి అనుభూతినిస్తుంది. ఇది గంటకు 85 కిలోమీటర్లు ప్రయాణించగలుతుంది. అదనంగా, బైక్ ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తుంది, ఇది 2 గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.



ఈఎంఐ ప్లాన్‌తో సరసమైన ధరలోనే..
అనుకూలమైన ఈఎంఐ ప్లాన్‌తో రివెల్ట్ ఆర్వీ400ని సొంతం చేసుకోవడం గతంలో కంటే ఇప్పుడు మరింత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.3 లక్షలుగా ఉండగా, మీ డ్రీమ్ బైక్‌ను సాధించగలిగేలా ఎంఐ ప్లాన్‌ని ఎంచుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఈఎంఐలను కొరుకొనే వారికి దాదాపు రూ25,000 డౌన్ పేమెంట్ అవసరం, మిగిలిన మొత్తం దాదాపు రూ. 4,682 నెలవారీ వాయిదాలలో చెల్లించబడుతుంది.
దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ బైక్ గా ఈ రీవోల్ట్ ఆర్వీ400 నిలుస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఈ యనిట్లు వక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ధర కూడా కాస్త తగ్గడం, లుక్ మంచి స్పోర్టీ లుక్ ఉండటంతో అందరూ ఆసక్తి చూపుతున్నాారు. ముఖ్యంగా యువకులు దీనిపై మోజు పడుతున్నట్లు నిపుణలు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..