Multi-Bagger Stock: పంట పండింది.. దానిలో పెట్టుబడి పెడితే ఏకంగా 770శాతం రాబడి..
మంచి మల్టీ బ్యాగర్ స్టాక్ ల కోసం మార్కెట్లో జల్లెడ పడుతున్నారు. మీరు కూడా అలాంటి మల్టీ బ్యాగర్ షేర్ కోసం చూస్తున్నట్లు అయితే ఈ కథనం మీ కోసమే. ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ (ఇండియా) లిమిటెడ్ (టీఆర్ఐఎల్) స్టాక్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. నాల్గో త్రైమాసిక ఫలితాలు వెల్లడి చేసిన తర్వాత, ఈ స్టాక్ పట్ల పెట్టుబడిదారుల ఉత్సాహం ఆకాశాన్ని తాకింది.

ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. రిస్క్ ఉన్నా అధిక రాబడి ఉంటుండటంతో అందరూ వీటివైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఏ స్టాక్ లు పడితే ఆ స్టాక్ లలో పెట్టుబడులు పెట్టడం లేదు. మంచి మల్టీ బ్యాగర్ స్టాక్ ల కోసం మార్కెట్లో జల్లెడ పడుతున్నారు. మీరు కూడా అలాంటి మల్టీ బ్యాగర్ షేర్ కోసం చూస్తున్నట్లు అయితే ఈ కథనం మీ కోసమే. ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ (ఇండియా) లిమిటెడ్ (టీఆర్ఐఎల్) స్టాక్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. నాల్గో త్రైమాసిక ఫలితాలు వెల్లడి చేసిన తర్వాత, ఈ స్టాక్ పట్ల పెట్టుబడిదారుల ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. ఏప్రిల్ 12న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో టీఆర్ఐఎల్ షేరు ధర రూ. 546.95 గా ఉంది. ఈ స్టాక్ ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు 770 శాతం రాబడిని ఇచ్చింది.
ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇడియా లిమిటెడ్..
ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ (ఇండియా) లిమిటెడ్ (టీఆర్ఐఎల్) 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం నాలుగు రెట్లు పెరిగి రూ.41.62 కోట్లకు చేరుకుంది.2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, ఇదే త్రైమాసికంలో, కంపెనీ రూ. 9.60 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
అదనంగా, 2023-24 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో మొత్తం ఆదాయం అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.439.50 కోట్ల నుంచి రూ.514 కోట్లకు పెరిగింది. మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో, కంపెనీ రూ. 47.01 కోట్ల లాభాన్ని నివేదించింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 42.35 కోట్ల నుంచి పెరిగింది.
ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ (ఇండియా) లిమిటెడ్ (టీఆర్ఐఎల్) షేర్లు గత 12 ట్రేడింగ్ సెషన్‌లలో పెరుగుతున్నాయి. ఒక సంవత్సరం క్రితం అంటే ఏప్రిల్ 10, 2023న, టీఆర్ఐఎల్ షేర్ ధర రూ. 59.45. ఇప్పుడు రూ.546.95కి పెరిగింది. అంటే ఈ మల్టీ-బ్యాగర్ షేర్ ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు దాదాపు 770 శాతం రాబడిని అందించింది.
ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ షేర్‌లో రూ.లక్ష పెట్టుబడి పెట్టి తన ఇన్వెస్ట్‌మెంట్‌ను కొనసాగించినట్లయితే, ఈ రోజు అతని పెట్టుబడి విలువ రూ.8,69,638గా మారింది. గత ఆరు నెలల్లో, ఈ మల్టీ-బ్యాగర్ స్టాక్ పెట్టుబడిదారులకు 204 శాతం రాబడిని ఇచ్చింది. ఇప్పటివరకు 2024 సంవత్సరంలో, ఈ స్టాక్ పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేసింది. ఈ కాలంలో టీఆర్ఐఎల్ షేర్ ధర 116 శాతం పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
