PF Withdrawal: నిమిషాల్లో రూ. 1లక్ష విత్ డ్రా.. పీఎఫ్ ఖాతాదారులు చేయాల్సిందిదే..

సాధారణంగా దీనిలో మొత్తాన్ని పదవీవిరమణ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే వీలుంటుంది. వైద్య చికిత్స, వివాహాలు, విద్య, గృహ రుణాలు, గృహ నిర్మాణ ఖర్చులు వంటి నిర్దిష్ట ఆర్థిక అవసరాలకు దీని నుంచి నగదును ముందస్తుగా ఉపసంహరించుకునే వీలుంటుంది.

PF Withdrawal: నిమిషాల్లో రూ. 1లక్ష విత్ డ్రా.. పీఎఫ్ ఖాతాదారులు చేయాల్సిందిదే..
Epfo
Follow us

|

Updated on: Aug 22, 2024 | 3:57 PM

ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతా ప్రతి ఉద్యోగికి ఉంటుంది. ఇది పదవీవిరమణ తర్వాత జీవితానికి ఉపయోగపడేలా రూపొందించిన స్కీమ్. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) నిర్వహిస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి నుంచి అలాగే తను పనిచేసే కంపెనీ నుంచి కొంత భాగం దానిలో జమవుతుంది. సాధారణంగా దీనిలో మొత్తాన్ని పదవీవిరమణ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే వీలుంటుంది. వైద్య చికిత్స, వివాహాలు, విద్య, గృహ రుణాలు, గృహ నిర్మాణ ఖర్చులు వంటి నిర్దిష్ట ఆర్థిక అవసరాలకు దీని నుంచి నగదును ముందస్తుగా ఉపసంహరించుకునే వీలుంటుంది. అయితే ఎక్కువ శాతం మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిన సమయంలోనే దీని నగదు విత్ డ్రా చేసేందుకు ఖాతాదారులు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో అత్యవసర చికిత్సల వేళ పీఎఫ్ నుంచి నగదు ఎలా విత్ డ్రా చేసుకోవచ్చు? తెలియాలంటే ఈ కథనం చదవండి..

మెడికల్ ఎమర్జెన్సీ వేళ పీఎఫ్ ఉపసంహరణ..

వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు లేదా ప్రాణాంతక పరిస్థితుల కారణంగా ఆస్పత్రిలో చేరిన సందర్భంలో, ఈపీఎఫ్ఓ ​​సభ్యులు రూ. 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈ అడ్వాన్స్‌ తీసుకోవాలంటే ఆస్పత్రి నుంచి ఎస్టిమేషన్ సమర్పించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే రూ. లక్ష ఏక మొత్తంలో మెడికల్ అడ్వాన్స్ మంజూరు చేస్తున్నారు. ఎందుకంటే ప్రాణాంతకమైన అనారోగ్యాల విషయంలో, రోగిని అతని/ఆమె ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఆసుపత్రిలో చేర్చడం తప్పనిసరి అని, అటువంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఆసుపత్రి నుంచి అంచనాను పొందడం సాధ్యం కాదని ఈపీఎఫ్ఓ ​​ఈ నిర్ణయం తీసుకుంది.

కొన్ని షరతులు ఉన్నాయి..

అయితే ఏక మొత్తంలో రూ. లక్ష విత్ డ్రా చేసే సమయంలో వ్యాధి చికిత్సకు సంబంధించి ఈఎస్ఐసీ లేదా సీజీహెచ్ఎస్ ఎంప్యానెల్డ్ హాస్పిటల్ వంటి ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ విభాగంలో చేరిన వారు ఉపసంహరణలు చేయవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రి విషయంలో మాత్రం ఈపీఎఫ్ఓ ప్రాథమికంగా కొన్ని అంశాలు తనిఖీ చేసి అడ్వాన్స్ ఇవ్వవచ్చా లేదా అనేది నిర్ణయిస్తారు.

ఈపీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ ఇలా..

  • ఈపీఎఫ్ఓ పోర్టల్‌కి వెళ్లండి. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్‌ని నమోదు చేయండి. లాగిన్ చేయడానికి క్యాప్చా కోడ్‌ను టైప్ చేయండి.
  • మీకు ఓపెన్ అయిన పేజీలో మీ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని నమోదు చేసి, కొనసాగించడానికి “వ్యాలిడేట్” ఎంచుకోండి.
  • ఈ సమాచారం మీ పీఎఫ్ ఖాతాకు లింక్ అవుతుంది. ఇప్పుడు, నిబంధనలు, షరతులను అంగీకరించడానికి “ఎస్”పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత “ఆన్‌లైన్ సర్వీసెస్” లింక్‌ని క్లిక్ చేసి, అనారోగ్యం కోసం క్లెయిమ్ ఫారమ్-31ని ఎంచుకోండి
  • దీని తర్వాత, ‘ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్’పై క్లిక్ చేయండి.
  • రోగి ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లయితే, పీఎఫ్ ఉపసంహరణ సౌకర్యాన్ని పొందేందుకు ఒక ఉద్యోగి తప్పనిసరిగా 45 రోజులలోపు మెడికల్ బిల్లులను ఈపీఎఫ్ఓకి సమర్పించాలి.
  • ప్రాసెస్ చేసిన తర్వాత, క్లెయిమ్ ఆమోదం కోసం యజమానికి ఇది వెళ్తుంది. సబ్‌స్క్రైబర్‌లు ‘ఆన్‌లైన్ సర్వీస్’ విభాగంలో ‘క్లెయిమ్ స్టేటస్’ ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీ క్లెయిమ్ స్థితిని పర్యవేక్షించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిమిషాల్లో రూ. 1లక్ష విత్ డ్రా.. పీఎఫ్ ఖాతాదారులు చేయాల్సిందిదే..
నిమిషాల్లో రూ. 1లక్ష విత్ డ్రా.. పీఎఫ్ ఖాతాదారులు చేయాల్సిందిదే..
రాత్రి వేళ మహిళలకు పోలీసు వాహనాల్లో ఉచిత ప్రయాణం నిజమేనా..?
రాత్రి వేళ మహిళలకు పోలీసు వాహనాల్లో ఉచిత ప్రయాణం నిజమేనా..?
అరంగేట్రంలోనే 41 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్.. బలైంది మనోడే
అరంగేట్రంలోనే 41 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్.. బలైంది మనోడే
విద్యుత్‌ మీటర్‌లో మాగ్నెట్‌ను అమర్చితే బిల్లు తగ్గుతుందా?
విద్యుత్‌ మీటర్‌లో మాగ్నెట్‌ను అమర్చితే బిల్లు తగ్గుతుందా?
గేదెలకు మేత వేయలేదని కొడుకు కాల్చి చంపిన తండ్రి
గేదెలకు మేత వేయలేదని కొడుకు కాల్చి చంపిన తండ్రి
రోహిత్, గంభీర్‌లకు అసలైన టెస్ట్.. 17 ఏళ్ల ఓటమికి చెక్ పెట్టేనా?
రోహిత్, గంభీర్‌లకు అసలైన టెస్ట్.. 17 ఏళ్ల ఓటమికి చెక్ పెట్టేనా?
ఏజెంట్లతో జాగ్రత్త సుమా? ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు..
ఏజెంట్లతో జాగ్రత్త సుమా? ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు..
కళ్లద్దాలను వాడకూడదంటే ఈ ఆహారాలు తింటే చాలు..
కళ్లద్దాలను వాడకూడదంటే ఈ ఆహారాలు తింటే చాలు..
వాగులో చేపల కోసం వల వేసి జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వాగులో చేపల కోసం వల వేసి జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
మాజీ ప్రధాని పాస్‌పోర్ట్‌ రద్దు చేసిన బంగ్లాదేశ్ సర్కార్
మాజీ ప్రధాని పాస్‌పోర్ట్‌ రద్దు చేసిన బంగ్లాదేశ్ సర్కార్
వాగులో చేపల కోసం వల వేసి జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వాగులో చేపల కోసం వల వేసి జాలరి.. చివర్లో ఊహించని ట్విస్ట్
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
వెండితెర శిఖరంలా మెగాస్టార్.! హీరో అవ్వకముందు చిరు ఏం చేసేవారంటే?
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
అబ్బవరం ఇంట మొదలైన పెళ్లి సందడి.! వీడియో షేర్ చేసిన హీరోయిన్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
పద్దతిపాడు లేని మనిషి.! బాలీవుడ్ స్టార్‌పై అజయ్‌ భూపతి సీరియస్.
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఇంద్ర సెట్లో చరణ్..! ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన సోనాలి..
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
ఎట్టకేలకు OTTలోకి వచ్చిన సమంత, రానా సూపర్ హిట్ మూవీ.!
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పైకి చూస్తే వట్టి పూతరేకుల పార్శిళ్లే.. తీరా తెరిచి చూడగా
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
పెళ్లైన 2 నెలలకే.. బిగ్ ట్విస్ట్‌ ఇచ్చిన సోనాక్షి.! హాట్ టాపిక్..
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
డైరెక్ట్‌ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ. ఎందుకలా.?
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే
ఎలాంటి టెస్టులకైనా సిద్ధం అంటున్న హేమ. కానీ నెటిజన్స్ రిప్లై వేరే