BSNL Offers: రోజుకు రూ. 3 కంటే తక్కువ ఖర్చు.. ప్రతి రోజూ 2జీబీ డేటాతో పాటు ఉచిత కాల్స్.. 300 రోజుల వ్యాలిడిటీ..
బీఎస్ఎన్ఎల్ రూ. 797తో ఓ మంచి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి. కేవలం రూ.797 తో రీచార్జ్ చేసుకుంటే 300 రోజుల పాటు ఇది పనిచేస్తుంది. ఈ ప్లాన్‌లో, వినియోగదారుడు ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు.
దేశీయ టెలికాం దిగ్గజం తన వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ప్లాన్లను తీసుకొస్తోంది. తక్కువ ధరతో అధిక ప్రయోజనాలతో కూడిన అనేక రీచార్జ్ ప్లాన్లను ప్రకటిస్తోంది. ఒకవేళ మీరు బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ వినియోగదారుడైతే.. ఈ కథనాన్ని తప్పక చదవాలి. దీనిలో అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. రోజుకు మూడు రూపాయల కన్నా తక్కువ ధరకే ప్రతి రోజూ 2జీబీ డేటాతో పాటు ఉచిత కాల్స్, ఫ్రీ మెసేజ్ లు అందిస్తుంది. సాధారణంగా ఒక జీబీ నెట్ కోసం ఇతర ప్రైవేటు టెలికాం సంస్థలు రూ.19 వసూలు చేస్తున్నాయి. అలాంటిది బీఎస్ఎన్ఎల్ కేవలం రూ. 3 కంటే తక్కువే 2జీబీ అందిస్తోంది. ఈ రీచార్జ్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రూ. 797 ప్లాన్..
బీఎస్ఎన్ఎల్ రూ. 797తో ఓ మంచి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో అనేక ఫీచర్లు ఉన్నాయి. కేవలం రూ.797 తో రీచార్జ్ చేసుకుంటే 300 రోజుల పాటు ఇది పనిచేస్తుంది. ఈ ప్లాన్‌లో, వినియోగదారు ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. దీనిని లెక్కిస్తే మీకు కేవలం రూ.2.65 మాత్రమే రోజుకు ఖర్చువుతున్నట్లు లెక్క. నెట్ తో పాటు అదనంగా ఉచిత కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలను పొందుతారు. వినియోగదారుడు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు వస్తాయి.
రెండు నెలలు మాత్రమే..
అయితే ఈ ఆఫర్ ప్లాన్ తీసుకున్న మొదటి రెండు నెలలకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో మరో ప్రయోజనం ఏంటంటే.. మీ సిమ్ ఏడాది పొడవునా యాక్టివ్ లో ఉంటుంది. డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ ఆఫర్లు కేవలం రెండు నెలల పాటు మాత్రమే పొందుతారు. అయితే సిమ్ ఏడాది పొడవునా యాక్టివ్ గా ఉండాలి అనుకొనే వారు.. దీని నుంచి ఎటువంటి డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ చేయాల్సిన అవసరం లేని వారికి ఈ ప్లాన్ మంచి ఆప్షన్. దీని వల్ల ఏడాది పాటు అపరిమిత ఇన్ కమింగ్ కాల్స్ కు అవకాశం ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ముఖ్యంగా వృద్ధులకు లేదా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.
రూ.1,198తో మరో ప్లాన్..
రూ.1198 ప్లాన్ కూడా ఒకటి ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అంటే మీరు రోజుకు రూ. 3.28 ఖర్చుతో ఈ ప్లాన్ నుంచి బెనిఫిట్స్ పొందొచ్చు. నెలకు 300 నిమిషాల వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 3 జీబీ డేటా వస్తుంది. నెలకు ఇది వర్తిస్తుంది. అలాగే నెలకు 30 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. ఈ రీచార్జ్ ప్లాన్స్ చాలా సర్కిళ్లలో అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీరు కూడా వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..