AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retirement planning: వృద్ధాప్యంలో సుఖమయ జీవనం కావాలా? అయితే మీ ప్లానింగ్ ఇలా ఉండాలి.. ఇప్పుడే మొదలెట్టండి..

ఉద్యోగ విరమణ ప్రణాళిక అనేది మీకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఒక స్థిరమైన ఆదాయం రావడానికి మార్గం చూపుతుంది. దీనికోసం మీరు ఉద్యోగం చేస్తుండగానే ప్రణాళిక వేసుకోవాలి. మీ ఖర్చులు, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని వివిధ మార్గాలలో పొదుపు చేయాలి.  ఆ అంశాలను గమనిస్తే మీరు విజయవంతంగా రిటైర్మెంట్ ప్రణాళిక వేసుకోవచ్చు. 

Retirement planning: వృద్ధాప్యంలో సుఖమయ జీవనం కావాలా? అయితే మీ ప్లానింగ్ ఇలా ఉండాలి.. ఇప్పుడే మొదలెట్టండి..
Retirement Plans
Madhu
|

Updated on: Mar 29, 2024 | 8:25 AM

Share

జీవితం సంతోషంగా సాగాలంటే ప్రతి విషయానికి ప్రణాళిక వేసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరిస్తేనే ఇబ్బంది లేకుండా ఉండగలం. వయసులో ఉన్నప్పుడు కష్టబడగలం, ఆదాయం వస్తుంది. అయితే వయసు పెరిగాక, ఉద్యోగ విరమణ చేశాక పరిస్థితి ఏమిటి. ఆదాయం తగ్గిపోవడంతో పాటు అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. వాటిని అధిగమించాలంటే ముందస్తుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ ప్రణాళిక చాలా అవసరం. ఉద్యోగ విరమణ ప్రణాళిక అనేది మీకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఒక స్థిరమైన ఆదాయం రావడానికి మార్గం చూపుతుంది. దీనికోసం మీరు ఉద్యోగం చేస్తుండగానే ప్రణాళిక వేసుకోవాలి. మీ ఖర్చులు, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని వివిధ మార్గాలలో పొదుపు చేయాలి.  ఆ అంశాలను గమనిస్తే మీరు విజయవంతంగా రిటైర్మెంట్ ప్రణాళిక వేసుకోవచ్చు.

ముందుగానే ప్రారంభించండి..

మీ ఉద్యోగ విరమణ ప్రణాళిక కోసం ముందుగానే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పీఎస్) వంటి ఇందుకు ఎంతో ఉపయోగపడతాయి. మ్యూచువల్ ఫండ్స్ మీకో మరో ఉత్తమ మార్గం. మీరు ఉద్యోగ సమయంలో వీటిలో సక్రమంగా పెట్టుబడి పెడితే, ఉద్యోగ విరమణ అనంతరం మీకు పెద్ద మొత్తంలో సొమ్మును అందిస్తాయి.

వివిధ మార్గాల అన్వేషణ..

డైవర్సిఫికేషన్ అనేది పెట్టుబడి వ్యూహానికి ప్రాథమిక సూత్రం. ఈక్విటీలు, స్థిర ఆదాయ సాధనాలు, రియల్ ఎస్టేట్, ప్రత్యామ్నాయ పెట్టుబడులు వంటి వివిధ మార్గాలకు మీ పొదుపులను మళ్లించాలి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ఈఎల్ఎస్ఎస్), మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లను ఎంచుకోవడం లాభదాయకం. తద్వారా మార్కెట్ అస్థిరతను ఎదుర్కోవడంతో పాటు ధీర్ఘకాలిక వృద్ధిని సాధించవచ్చు.

ఇవి కూడా చదవండి

యజమాని నుంచి ప్రయోజనాలు..

చాలా మంది యజమానులు తమ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తారు. వాటిలో పెన్షన్ ప్లాన్లు, ఈపీఎఫ్/ ఎన్ పీఎస్ కు సరిపోలే విరాళాలు, గ్రాట్యుటీ చెల్లింపులు ఉంటాయి.

పన్ను ప్రణాళిక..

ఉద్యోగ విరమణ ప్రణాళికలో పన్ను ప్రణాళిక అంతర్భాగం. రాబడిని పెంచుకుంటూ, పన్నులను తగ్గించుకోవడానికి ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలి. మీ ఉద్యోగ విరమణ పొదుపును మెరుగుపరచడానికి సెక్షన్ 80సీ తగ్గింపులు,  ఇతర పన్ను-పొదుపు నిబంధనలను తెలుసుకోవాలి.

నిరంతర పర్యవేక్షణ..

మీ ఆర్థిక అవసరాలు, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షణ చేయాలి. అవి ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. ఒక్కోసారి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ పెట్టుబడులకు అనుగుణంగా ఖర్చులు, ఆదాయాన్ని సర్దుబాటు చేసుకోవాలి.

ద్రవ్యోల్బణం..

ద్రవ్యోల్బణం అనే ఉద్యోగ విరమణ పొదుపులపై ప్రభావం చూపుతుంది. అది డబ్బు కొనుగోలు శక్తిని క్షీణింపజేస్తుంది, ఉద్యోగ విరమణ ఖర్చులపై దీని ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఈక్విటీలు, ఇతర దీర్ఘకాలిక ఉత్పత్తుల వంటి ద్రవ్యోల్బణాన్ని అధిగమించే అవకాశం ఉన్న పెట్టుబడులను ఎంచుకోవాలి.

ఆరోగ్య సంరక్షణ..

రిటైర్మెంట్ తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటికి చేయించుకునే చికిత్సలు మీకు ఆర్థికంగా భారంగా మారతాయి. అందుకు మంచి ఆరోగ్య బీమా పథకాన్నిఎంచుకోవాలి. తద్వారా మీరు ఆస్పత్రి ఖర్చులకు దూరంగా ఉండవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..