AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Save Income tax: ఆదాయ పన్నును ఆదా చేసే మార్గాలివే.. పూర్తి భద్రత, భరోసా.. వివరాలు తెలుసుకోండి..

ఆదాయ పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. ముఖ్యంగా 80సీ సెక్షన్ పరిధిలోకి వచ్చే పలు పథకాలలో మీరు పెట్టుబడి పెడితే దాదాపు రూ. 1.50లక్షల వరకూ ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది. 

Save Income tax: ఆదాయ పన్నును ఆదా చేసే మార్గాలివే.. పూర్తి భద్రత, భరోసా.. వివరాలు తెలుసుకోండి..
Income Tax
Madhu
|

Updated on: Mar 13, 2023 | 2:00 PM

Share

కేవలం రోజుల వ్యవధిలో 2022–23 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సంర ప్రారంభమవుతుంది. పన్ను చెల్లింపుదారులు ప్రస్తుతం కొంచెం ఆందోళనలో ఉంటారు. అప్డేడేటెడ్ ఐటీఆర్ దాఖలు చేయడానికి సమయం అయిపోతోంది. మార్చి 31లోపు అన్ని పూర్తి చేయాలి. అయితే ఆఖరి నిమిషంలో కూడా పన్ను రూపంలో చెల్లించాల్సిన కొంత మొత్తాన్ని అయినా ఆదా చేసుకుందామని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. చట్టబద్ధంగా కొన్ని మార్గాల ద్వారా ఈ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టడం చేయడం ద్వారా ఆదాయ పన్ను భారాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందులో 80సీ సెక్షన్ ఒకటి. దీని ఉపయోగించి భారీగా పన్నును ఆదా చేసుకోవచ్చు. ఆరోగ్య బీమా, టర్మ్ బీమా, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్లలలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు పొంద వచ్చు. అలాగే ఎన్ఎస్సీ,పీపీఎఫ్, ఎస్ఎస్ వై వంటి పథకాలలో కూడా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. పైగా ఈ పథకాలు పూర్తి సురక్షితమైనవి. దీనితో పాటు పలు సెక్షన్ ల కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..

సెక్షన్ 80 సీ.. ఆదాయ పన్ను చట్టంలోని ఈ 80 సీ సెక్షన్ కింద గరిష్టంగా రూ. 1,50,000 వేల వరకు మినహాయింపు పొందవచ్చు. ఎల్ ఐసీ ప్రీమియంలు, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్, పీపీఎఫ్, టర్మ్ డిపాజిట్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ సెక్షన్ కింద మినహాయింపు పొందవచ్చు. అవి కాకుండా పిల్లల ట్యూషన్ ఫీజు, గృహ రుణాల అసలు చెల్లింపు లపై కూడా ఈ సెక్షన్ కింద మినహాయింపు పొందవచ్చు. అయితే, ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ 1.5 లక్షల మినహాయింపు మాత్రమే సాధ్యమవుతుంది. అలాగే గృహ రుణాలపై కూడా ఈ సెక్షన్ కింద మినహాయింపులు పొందవచ్చు. రూ. 2లక్షల హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ పై మినహాయింపు వర్తిస్తుంది.

సెక్షన్ 80 డీ.. ఆదాయ పన్ను చట్టంలోని ఈ 80 డీ చట్టం ప్రకారం రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. తనతో పాటు భార్య, తనపై ఆధారపడి ఉన్న పిల్లలు, తల్లిదండ్రులకు సంబంధించిన మెడికల్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం, కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్స్ లో చెల్లింపుల ద్వారా ఈ మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్ మెడికల్ ఇన్స్యూరెన్స్ కోసం చెల్లింపు జరిపితే గరిష్టంగా రూ. 50 వేల వరకు మినహాయింపు ఉంటుంది. హెల్త్ ఇన్య్సూరెన్స్ లేని సీనియర్ సిటిజన్ వైద్య ఖర్చుల కోసం జరిపిన చెల్లింపులు కూడా ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.

ఇవి కూడా చదవండి

సెక్షన్ 80 సీసీడీ(1బీ).. సెక్షన్ 80సీసీడీ ప్రకారం ఎన్పీఎస్ తీసుకొనే వ్యక్తులకు మినహాయింపులు లభిస్తాయి. ఈ 80సీసీడీ(1బీ) సెక్షన్ కింద వ్యక్తులు అదనంగా రూ. 50 వేల వరకు ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు.

సెక్షన్ 80ఈఈ.. సెక్షన్ 80ఈఈ కింద హోమ్ లోన్ వడ్డీపై రూ. 50,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

సెక్షన్ 80 జీ.. స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన విరాళాలకు ఈ 80జీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. విరాళం పొందిన స్వచ్ఛంధ సంస్థ ను బట్టి 50% లేదా 100% డిడక్షన్ పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..