Health Insurance: పాలసీ పోర్టింగ్ అంటే ఏమిటి? దాని వల్ల ప్రయోజనం ఏమిటి? పూర్తి వివరాలు
చాలా మంది పాలసీ తీసుకునే ముందు ఆ కంపెనీ ట్రాక్ రికార్డు, క్లయిమ్ సెటిల్మెంట్ రేషియోను చూసుకోకుండా తీసేసుకుంటారు. ఆ తర్వాత సర్వీస్ నచ్చక పాలసీని రద్దు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొత్త కంపెనీకి మారడానికిమొగ్గు చూపుతారు. అయితే దానికి బదులు మరో ఆప్షన్ ఉంది. అదే ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్టు పెట్టుకోవడం. సిమ్ కార్డు పోర్టు పెట్టుకున్నట్లు అన్నమాట.

ఇటీవల కాలంలో అందరూ హెల్త్ ఇన్సురెన్స్ పాలసీని కలిగి ఉంటున్నారు. కరోనా పరిణామాల తర్వాత హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ ప్రాధాన్యం అందరికీ తెలుసొచ్చింది. అందుకే ఏదో ఒక కంపెనీకి చెందిన పాలసీలను తీసుకుంటున్నారు. అయితే చాలా మంది పాలసీ తీసుకునే ముందు ఆ కంపెనీ ట్రాక్ రికార్డు, క్లయిమ్ సెటిల్మెంట్ రేషియోను చూసుకోకుండా తీసేసుకుంటారు. ఆ తర్వాత సర్వీస్ నచ్చక పాలసీని రద్దు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొత్త కంపెనీకి మారడానికిమొగ్గు చూపుతారు. అయితే దానికి బదులు మరో ఆప్షన్ ఉంది. అదే ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్టు పెట్టుకోవడం. సిమ్ కార్డు పోర్టు పెట్టుకున్నట్లు అన్నమాట. ఇది సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమేతే పాలసీదారులకు నష్టమా? లాభమా? ఇతర చార్జీలు ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా? పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..
పోర్టింగ్ ఎందుకు?
అధిక ప్రీమియంలు లేదా లోపభూయిష్ట క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియల కారణంగా తమ ఆరోగ్య బీమా కంపెనీలపై అసంతృప్తితో ఉన్న పాలసీదారులు తరచుగా మెరుగైన ఎంపికల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే అధిక ప్రీమియంలు లేదా తక్కువ ప్రయోజనాల కారణంగా ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పాలసీని మధ్యలో నిలిపివేసి, కొత్త ప్లాన్‌ను కొనుగోలు చేయాలనేకుంటే అది అంతే శ్రేయస్కరం కాదు. మీకు కవర్ లేనప్పుడు మధ్య కాలంలో మీరు ఆస్పత్రిలో చేరవచ్చు. అప్పుడు మీ జేబులో నుంచి ఖర్చులను భరించవలసి ఉంటుంది. దీనికి బదులుగా మీ పాలసీని మరొక బీమా సంస్థకు ‘పోర్ట్’ చేయడం తెలివైన విధానం. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..
జూలై 2011లో, ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆరోగ్య బీమా పోర్టబిలిటీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పాలసీదారులు తమకు కావాలంటే బీమా సంస్థలను మార్చుకోవచ్చు. పోర్టబిలిటీ అనేది పాలసీదారులు తమ ప్రస్తుత పాలసీలో పొందే కొనసాగింపు ప్రయోజనాలను కోల్పోకుండా ఒక బీమా సంస్థ నుంచి మరొక దానికి మారడానికి అనుమతిస్తుంది. చాలా పాలసీలు ముందుగా ఉన్న వ్యాధులను కవర్ చేస్తాయి. మీరు పాలసీని కొనుగోలు చేయడానికి ముందు మీరు సంక్రమించినవి కూడా కవర్ అవుతాయి.
పోర్టింగ్ వల్ల ప్రయోజనాలు..
పాలసీ పోర్టబులిటీ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం వెయిటింగ్ పీరియడ్. సాధారణంగా ఏ పాలసీ అయిన కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇక ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీస్ పై అయితే అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పాలసీ పోర్టింగ్ తో ఆ వెయిటింగ్ పీరియడ్ లేకుండా చేసుకోవచ్చు. మీరు ఒక పాలసీ నుంచి మరొక పాలసీకి పోర్ట్ చేసినప్పుడు, వెయిటింగ్ పీరియడ్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభం కాదు. మీ పాలసీ ముందుగా ఉన్న వ్యాధుల కోసం నాలుగు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్‌తో వస్తుంది అనుకుందాం. పాలసీని తీసుకున్న మూడేళ్ల తర్వాత మీరు పోర్ట్ చేసుకుంటే మీ కొత్త బీమా సంస్థ ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. దీనిని వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్‌గా సూచిస్తారు. మీ పాలసీ నాలుగు సంవత్సరాల కంటే పాతది అయితే, పాలసీని కొనుగోలు చేసిన వెంటనే మీ కొత్త బీమా సంస్థ మీ ముందుగా ఉన్న వ్యాధులను కవర్ చేయడం ప్రారంభిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








