AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Rates: ఆ జీఎస్టీ శ్లాబ్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. ఆ వస్తువల ధరల తగ్గింపు

మార్కెటింగ్ రంగంలోని వారికి జీఎస్టీ అంటే పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ముఖ్యంగా వివిధ రకాల పన్నులన్నింటినీ ఒకే రకమైన పన్ను విధానంలోకి తీసుకొచ్చి వేసే పన్నును జీఎస్టీ అంటారు. దేశంలో విక్రయించే వివిధ వస్తువుల వివిధ శాతాలతో జీఎస్టీ విధిస్తారు. అయితే 12 శాతం శ్లాబ్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

GST Rates: ఆ జీఎస్టీ శ్లాబ్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. ఆ వస్తువల ధరల తగ్గింపు
Gst
Nikhil
|

Updated on: Jun 06, 2025 | 8:28 PM

Share

జీఎస్టీలో 12 శాతం పన్ను స్లాబ్‌ను తొలగించే ప్రణాళికను జీఎస్టీ కౌన్సిల్ త్వరలో పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ శ్లాబ్ నాలుగు నుంచి మూడుకు తగ్గించవచ్చని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జూన్-చివరిలో లేదా జూలైలో కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో 12 శాతం శ్లాబ్ గురించి జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ ఆదాయ తటస్థతను కొనసాగిస్తూ 12 శాతం స్లాబ్‌ను తొలగించడం ద్వారా రేట్లను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుతం జీఎస్టీ విధానంలో ప్రధానంగా నాలుగు పన్ను శ్లాబులు ఉన్నాయి, 5%, 12%, 18%, 28%. అయితే దీంతో పాటు ఆభరణాలపై కూడా 3 శాతం ఉంది. చాలా మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నిపుణులు, జీఓఎం ప్రతినిధులు 12 శాతం GST స్లాబ్‌ను తొలగించే ప్రణాళికను సమర్థించారు. ఈ శ్లాబ్ కిందకు వచ్చే వస్తువులను 5 శాతం లేదా 18 శాతానికికి మార్చవచ్చని నివేదికల్లో స్పష్టం అవుతుంది.  ముఖ్యంగా రోజువారీగా ఉపయోగించే సామూహిక వినియోగ వస్తువులను 5 శాతం పన్ను స్లాబ్‌కి మార్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

ఈ సేవలపై  పన్ను తగ్గింపు

  • ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలు అంటే వెన్న, నెయ్యి, జున్ను, పండ్ల రసాలు, జామ్‌లు, జెల్లీలు, నమ్కీన్లు (భుజియాతో సహా) వంటి వాటి ధరలు తగ్గే అవకాశం ఉంది. 
  • డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, ఖర్జూరం, ఇతర డ్రై ఫ్రూట్స్ ధరలు తగ్గే అవకాశం
  • పండ్ల రసం ఆధారిత పానీయాలు, ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు.
  • గొడుగులు, నిర్దిష్ట గృహోపకరణాలు, చెరకు లేదా కలపతో చేసిన ఫర్నిచర్.
  • జనపనార లేదా పత్తితో చేసిన పెన్సిళ్లు, క్రేయాన్లు, హ్యాండ్‌బ్యాగులు, షాపింగ్ బ్యాగులు.
  • రూ.1000 కంటే తక్కువ ధరతో ఉండే పాదరక్షల ధరలు 
  • డయాగ్నస్టిక్ కిట్లు
  • నిర్మాణ సామగ్రి అంటే పాలరాయి, గ్రానైట్ బ్లాక్స్‌లు

వీటి ధరలు పెరిగే అవకాశం

  • రూ.7500 వరకు ఉండే హోటల్ వసతి ధరలపై 18 శాతం శ్లాబ్ విధింపు
  • ఎకనామిక్ తరగతుల్లో విమానాల టిక్కెట్ల ధరలు
  • కొన్ని నిర్దిష్ట నిర్మాణ పనులు.
  • కొన్ని రకాల మల్టీమోడల్ రవాణా సేవలు.
  • కొన్ని రకాల వృత్తిపరమైన, సాంకేతిక, వ్యాపార సేవలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి