AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Council Meeting: జోమాటో.. స్విగ్గీ జీఎస్టీ పరిధిలోకి.. వినియోగదారునికి ఇబ్బంది లేదు.. ఎలా అంటే..

ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. వెళ్ళిపోతోంది. కానీ, అందరూ  ఆశించినట్టు ఊరట కలిగించే  మార్పులు మాత్రం రాలేదు.

GST Council Meeting: జోమాటో.. స్విగ్గీ జీఎస్టీ పరిధిలోకి.. వినియోగదారునికి ఇబ్బంది లేదు.. ఎలా అంటే..
Gst On Food Delivery
KVD Varma
|

Updated on: Sep 17, 2021 | 10:14 PM

Share

GST Council Meeting: ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. వెళ్ళిపోతోంది. కానీ, అందరూ  ఆశించినట్టు ఊరట కలిగించే  మార్పులు మాత్రం రాలేదు. ఈరోజు (17 సెప్టెంబర్, 2021) జిఎస్‌టి కౌన్సిల్  45 వ సమావేశం లక్నోలో ఆర్ధిక మంత్రి నిర్మలా  సీతారామన్ అధ్యక్షతన  జరిగింది. ఈ సమావేశంలో  పెట్రోల్ డీజిల్ జీఏస్టీ పరిధిలోకి తీసుకువస్తారని అందరూ ఊహించారు. అయితే, అలా జరగలేదు. ఆ విషయం అలా ఉంచితే, ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫారంల పై జీఎస్టీ విధిస్తారని ప్రచారం జరిగింది. ఇది కూడా జరగలేదు. కాకపోతే, అక్కడిది ఇక్కడ అనే పద్ధతిలో కొద్ది మార్పులు చేశారు.

ఇంతకు ముందు ఫుడ్ ఆర్డర్ చేసినపుడు జీఎస్టీ రెస్టారెంట్ల బిల్లులో నేరుగా వినియోగదారుడు చెల్లించేవాడు. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చారు.  ఫుడ్ బిల్లులో డెలివరీ జీఎస్టీ ఉండదు. అది డెలివరీ కంపెనీలకు బదలాయించారు. ఎలా అంటే.. ఫుడ్ డెలివరీ కంపెనీలు వినియోగదారుని నుంచి జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తారు.

శక్తివంతమైన జిఎస్‌టి కౌన్సిల్ ఈ రోజు ఆన్‌లైన్ ఫుడ్-డెలివరీ ఆపరేటర్‌లైన జొమాటో, స్విగ్గీపై పన్ను విధించాలని నిర్ణయించింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు వాటి ద్వారా సరఫరా చేయబడిన రెస్టారెంట్ సేవపై జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుందని, డెలివరీ సమయంలో పన్ను విధిస్తారని ఆర్ధిక మంత్రి  నిర్మలా సీతారామన్ చెప్పారు. స్విగ్గీ, జొమాటో ద్వారా డెలివరీ చేయబడిన చోట 5% GST విధించబడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.

ఇంతకు ముందు రెస్టారెంట్ల ద్వారా ఈ పన్ను చెల్లించేవారు. కానీ ఇప్పుడు జొమాటో,  స్విగ్గీ వంటి అగ్రిగేటర్లు పన్ను చెల్లిస్తారని GST మండలి నిర్ణయించింది. ఈ చర్య ఆదాయాన్ని రక్షించడంలో సహాయపడుతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం, ఈ యాప్‌లు GST రికార్డులలో TCS లేదా మూలం వద్ద సేకరించిన పన్నుగా నమోదు అయి ఉన్నాయి.

కొత్త పన్నులు ప్రకటించలేదు

GST సమావేశం తరువాత, రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్ కొత్త పన్నులు ప్రకటించడం లేదని, GST కలెక్షన్ పాయింట్ కేవలం బదిలీ చేయబడుతోందని చెప్పారు.

“మీరు అగ్రిగేటర్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేశారని అనుకుందాం … ఇప్పుడు రెస్టారెంట్ పన్నులు చెల్లిస్తోంది. అయితే,   కొన్ని రెస్టారెంట్లు పన్నులు ప్రభుత్వానికి చెల్లించడం లేదని తేలింది. అందుకే.. మీరు ఆర్డర్ చేస్తే అగ్రిగేటర్ వినియోగదారుడి నుండి సేకరించి అధికారులకు బదులుగా చెల్లిస్తారని రెవెన్యూ కార్యదర్శి చెప్పారు. అంతే కాకుండా కొత్త పన్ను లేదు  అని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

Vaccine Fake Certificate: టెలిగ్రాం వేదికగా నకిలీ కరోనా టీకా సర్టిఫికెట్ల జోరు.. చెక్ పాయింట్ నివేదికలో వెల్లడి!

Elon Musk Space X: మరోచరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్..అంతరిక్షంలోకి సామాన్యులను చేర్చిన స్పేస్ ఎక్స్