వ్యాపారం ఏదైనా.. మొదట్లో కొన్ని లాస్‌లు రావడం సర్వసాధారణం. కానీ వాటినన్నింటిని ఎదుర్కుని నిలదొక్కుకుంటేనే.. ఉన్నత శిఖరాలకు చేరగలం. అలా రూ. 4 వేలతో తన వ్యాపారాన్ని మొదలుపెట్టిన ఓ వ్యక్తి.. ప్రస్తుతం రూ. 1300 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతడు ఎవరంటే.? గోపాల్ స్నాక్స్ వ్యవస్థాపకుడు బిపిన్ భాయ్ హద్వానీ. ప్రస్తుతం రూ.1300 కోట్ల టర్నోవర్ ఇస్తోన్న కంపెనీకి చైర్మన్. బిపిన్ తండ్రి ఒకప్పుడు తన సైకిల్‌పై నమ్‌కీన్, ఇతర స్నాక్స్ అమ్మేవారు. ఇక ఆ వ్యాపారాన్ని ఇప్పుడు కోట్ల సామ్రాజ్యంగా మార్చాడు.
ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన బిపిన్.. మొదట్లో అతడి కుటుంబంతో కలిసి రాజ్‌కోట్‌లోని ఒక గ్రామంలో నివాసముండేవాడు. బిపిన్ తండ్రికి నమ్‌కీన్ షాప్ ఉండేది. బిపిన్ తండ్రి తన ఇంట్లో ఈ నమ్‌కీన్‌లను తయారు చేసి.. వాటితో పాటు పలు రకాల చిరుతిళ్లను సైకిల్‌పై పెట్టి ఇంటింటికి వెళ్లి అమ్మేవారు. బిపిన్ కాలేజీకి వెళ్లి.. పైచదువులు చదవాలని అతడి తండ్రి కోరుకునేవారు. కానీ బిపిన్ కల వేరు. అతను ఎప్పుడూ వ్యాపారం చేయాలనుకున్నాడు. కుమారుడి కల గురించి తెలిసిన తండ్రి.. అతడికి రూ.4500 ఇచ్చి వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇక తండ్రి ఇచ్చిన ఆ రూ.4500తో బిపిన్ రాజ్‌కోట్ వచ్చాడు. 1991 సంవత్సరంలో, అతడు తన స్నేహితులతో కలిసి గోపాల్ గృహ్ ఉద్యోగ్ పేరుతో గుజరాతీ స్నాక్స్‌ను ప్రారంభించాడు. నెమ్మదిగా అతడి వ్యాపారం బాగా వృద్ధి చెందింది. అయితే కొన్ని విషయాల్లో బిపిన్, అతడి భాగస్వామి మధ్య విభేదాలు రావడంతో.. 1994లో, వారిద్దరూ తమ వ్యాపారానికి ముగింపు పలికారు.
ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట
ఆ వ్యాపారం ద్వారా వచ్చిన రూ.2.5 లక్షలతో మళ్లీ బిపిన్.. స్నాక్స్ షాప్ తెరిచాడు. అయితే సున్నా నుంచి మళ్లీ వ్యాపారం ప్రారంభించడం బిపిన్‌కి అంత ఈజీ కాదు. అందుకే బిపిన్ సైకిల్‌పై రాజ్‌కోట్ వీధుల్లో తిరుగుతూ నమ్‌కీన్ అమ్మడం ప్రారంభించాడు, అదే కాకుండా దుకాణదారులు, రిటైలర్లు, డీలర్‌లతో మాట్లాడి విక్రయాలు సాగించాడు. తన ఉత్పత్తుల ధరలను పెంచకుండా.. కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్టుగా వివిధ రకాల నమ్‌కీన్‌లను తయారు చేస్తూ.. విక్రయించాడు. నాలుగేళ్ళు కష్టపడి బిపిన్ రాజ్‌కోట్‌లో స్థలం కొని నమ్‌కీన్ తయారీ ప్లాంట్ నెలకొల్పాడు. 2012 నాటికి కంపెనీని రూ.100 కోట్ల ఆదాయానికి తీసుకెళ్లాడు.
ఇది చదవండి: పైసా ఖర్చు లేకుండానే నెలకు రూ. లక్ష సంపాదన.. ఎలాగంటారా.!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..