AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Destination Alert: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై దిగే స్టేషన్ గురించి ప్రత్యేక అలెర్ట్

భారతీయ రైల్వేలు ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంపొందించడానికి వివిధ సేవలను అందిస్తున్నాయి. పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ప్రస్తుతం అంతా మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వేలు కూడా మొబైల్స్ ఫోన్స్ నుంచే టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తుంది. అలాగే ఫోన్స్ ద్వారానే ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసులబాటును కల్పించింది. ఇప్పుడు తాజా ఓ అప్‌డేట్ అందరినీ ఆకర్షిస్తుంది.

Railway Destination Alert: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై దిగే స్టేషన్ గురించి ప్రత్యేక అలెర్ట్
Irctc
Nikhil
|

Updated on: Mar 24, 2024 | 7:45 PM

Share

భారతదేశంలో రైల్వేలు అనేవి అత్యంత చౌకైన ప్రయాణాన్ని అందించే సాదనంగా ప్రజలు భావిస్తారు. రోజూ కోట్లాది మంది ప్రజలు రైల్వేల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో  భారతీయ రైల్వేలు ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంపొందించడానికి వివిధ సేవలను అందిస్తున్నాయి. పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ప్రస్తుతం అంతా మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వేలు కూడా మొబైల్స్ ఫోన్స్ నుంచే టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తుంది. అలాగే ఫోన్స్ ద్వారానే ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వెసులబాటును కల్పించింది. ఇప్పుడు తాజా ఓ అప్‌డేట్ అందరినీ ఆకర్షిస్తుంది. సాధారణంగా రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు నిద్రమత్తులో మనం దిగాల్సిన స్టేషన్‌ను దాటేస్తూ ఉంటాం. ఇది వినడానికి వింతగా ఉన్న అనుభవించే వారికి సమస్య ఎంత పెద్దదో? తెలుస్తుంది. ఇలాంటి సమస్య నుంచి ప్రయాణికులకు సాయం చేసేందుకు వారికి అలెర్ట్‌లను అందించే సరికొత్త ఫీచర్‌ను భారతీయ రైల్వేలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ సరికొత్త అప్‌డేట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

సరికొత్త అలెర్ట్ ఫీచర్ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య అందుబాటులో ఉంటుంది. ఇది ఒంటరిగా ప్రయాణించేవారికి లేదా రైలు ప్రయాణాల్లో నిద్రించడానికి ఇబ్బంది పడేవారికి, తమ స్టాప్ మిస్ అవుతుందనే భయం ఉన్నవారికి ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సేవను ఎంచుకునే ప్రయాణీకులు స్టేషన్‌కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు వారి నిర్దేశిత మొబైల్ నంబర్‌కు వేక్-అప్ కాల్ లేదా ఎస్ఎంఎస్‌ను అందుకోవచ్చు. ముఖ్యంగా ఈ సేవకు ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం లేదు కానీ కాల్‌లు, ఎస్ఎంఎస్‌లకు మాత్రం ఛార్జీలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఐవీఆర్ఎస్ సేవలు ఇలా

  • గమ్యస్థాన హెచ్చరికను సెట్ చేయడానికి మీ మొబైల్ నుండి 139కి డయల్ చేసి, నచ్చిన భాషను ఎంచుకోవాలి. 
  • ప్రాంప్ట్ చేసినప్పుడు ఐవీఆర్ మెయిన్ మెనూలో 7ని ఎంచుకోవాలి.
  • అనంతరం గమ్యస్థాన హెచ్చరికను సెట్ చేయడానికి 2 నొక్కాలి.
  • మీ టిక్కెట్‌పై పేర్కొన్న పీఎన్ఆర్ నెంబర్‌ను నమోదు చేసి, నిర్ధారించడానికి 1 నొక్కాలి.
  • దీంతో గమ్యస్థాన హెచ్చరిక సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ మొబైల్‌లో నిర్ధారణ ఎస్ఎంఎస్ అందుకుంటారు.

ఎస్ఎంఎస్ ద్వారా

  • మీ ఫోన్‌లో ఎస్ఎంఎస్ యాప్‌ని తెరిచి, ‘Alert’ అని టైప్ చేసి 139కి పంపాలి. అంతే మీ గమ్యస్థాన హెచ్చరిక ప్రయాణానికి సెట్ చేయబడుతుంది.
  • అయితే మీరు గమ్యస్థాన హెచ్చరికను స్వీకరించాలనుకుంటున్న అదే నంబర్‌ను ఉపయోగించి కాల్/ఎస్ఎంఎస్ చేయాలని నిర్ధారించుకోవాలి. అలాగే 139కి కాల్ చేయడం/ఎస్ఎంఎస్ పంపడం ఛార్జ్ చేస్తారని వినియోదారులు గమనించాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..