PMSBY: రూ. 20తో రూ. 2 లక్షల బీమా.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
బ్యాంకు ఖాతా ఉన్న ప్రతీ ఒక్క భారతీయ పౌరుడు ఈ పథకంలో చేరొచ్చు. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఈ పథకాన్ని 2015లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీలో చేరిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 2 లక్షల బీమా అందుతుంది. అలాగే పాక్షికంగా వైకల్యానికి గురైతే రూ. 1 లక్ష అందుతుంది. ఇందుకోసం పాలసీదారుడు...

ప్రస్తుతం ఆర్థికపరమైన అంశాలపై ప్రతీ ఒక్కరిలోనూ అవగాహన పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం కొందరు మాత్రమే బీమాలు తీసుకునే వారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఏదో ఒక బీమాను తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సైతం పేదల కోసం మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పేరుతో తీసుకొచ్చిన ఈ బీమాలో ఇప్పటికే చాలా మంది ప్రజలు చేరారు. ఇంతకీ ఈ బీమాతో కలిగే ప్రయోజనాలు ఏంటి.? ఎంత ప్రీమియం చెల్లించాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాంకు ఖాతా ఉన్న ప్రతీ ఒక్క భారతీయ పౌరుడు ఈ పథకంలో చేరొచ్చు. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఈ పథకాన్ని 2015లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీలో చేరిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 2 లక్షల బీమా అందుతుంది. అలాగే పాక్షికంగా వైకల్యానికి గురైతే రూ. 1 లక్ష అందుతుంది. ఇందుకోసం పాలసీదారుడు ఏడాదికి కేవలం రూ. 20 చెల్లిస్తే సరిపోతుంది. నిజానికి ఈ ప్రీమియం ముందు రూ. 12గా ఉండేది కానీ తర్వాత రూ. 20కి పెంచారు. ప్రతీ ఏడాది జూన్ 1వ తేదీన ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
మీరు ఎంపిక చేసుకున్న బ్యాంక్ ఖాతా నుంచి ఈ ప్రీమియం ఆటోమెటిక్‌గా కడ్ అవుతుంది. అకౌంట్‌లో రూ. 20 లేకపోతే బీమా రెన్యువల్ కాదు. కాబట్టి జూన్‌లో రూ. 20 ఉండేలా చూసుకోవాలి. ఇక ఈ పథకంలో చేరాలనుకునే వారు 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న వారై ఉండాలి. దేశంలోని ఏదైనా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే చాలు. జాయింట్ ఖాతా ఉన్నవారు కూడా ఈ పథకంలో చేరొచ్చు. ఇదిలా ఉంటే ఈ పథకంలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 31 కోట్లుకుపైగా ప్రజలు చేరారు. ఇక పథకం ద్వారా ఇప్పటి వరకు సుమారు లక్షకిపైగా కుటుంబాలు రూ. 2,302 కోట్లు లబ్ధి పొందినట్లు అధికారులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




