AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narayana Murthy: ఇన్ఫోసిస్‌లో నారాయణమూర్తి 4 నెలల మనవడు కోటీశ్వరుడు.. ఎవరికి ఎంత వాటా?

దేశంలోని రెండవ అతిపెద్ద IT కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌లో 4 నెలల చిన్న అతిథి కొత్త వాటాదారుగా ప్రవేశించారు. సోమవారం, కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన మనవడికి లక్షల ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చాడు. అలాగే ఈ షేర్ల విలువ రూ.240 కోట్లు. దీంతో నారాయణమూర్తి తనయుడు రోహన్ మూర్తి కుమారుడు ఏకగ్ర రోహన్ మూర్తి దేశంలోనే అత్యంత..

Narayana Murthy: ఇన్ఫోసిస్‌లో నారాయణమూర్తి 4 నెలల మనవడు కోటీశ్వరుడు.. ఎవరికి ఎంత వాటా?
Narayana Murthy Family
Subhash Goud
|

Updated on: Mar 24, 2024 | 5:49 PM

Share

దేశంలోని రెండవ అతిపెద్ద IT కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌లో 4 నెలల చిన్న అతిథి కొత్త వాటాదారుగా ప్రవేశించారు. సోమవారం, కంపెనీ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన మనవడికి లక్షల ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చాడు. అలాగే ఈ షేర్ల విలువ రూ.240 కోట్లు. దీంతో నారాయణమూర్తి తనయుడు రోహన్ మూర్తి కుమారుడు ఏకగ్ర రోహన్ మూర్తి దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన కోటీశ్వరుడయ్యాడు. ఇన్ఫోసిస్‌లో మూర్తి కుటుంబంలో ఎవరికి ఎంత వాటా ఉందో తెలుసుకుందాం.

ఏకాగ్ర రోహన్ మూర్తి:

ముందుగా మూర్తి కుటుంబంలోని అతి పిన్న వయస్కుడు, ఇన్ఫోసిస్ సరికొత్త వాటాదారు గురించి తెలుసుకుందాం. ఏకాగ్ర రోహన్ మూర్తి నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి కుమారుడు. అతని వయస్సు కేవలం 4 నెలలు మాత్రమే. ఈ వయసులో ఏకాగ్రాను మిలియనీర్‌ని చేసి, ఇన్ఫోసిస్‌కు చెందిన 15 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చాడు. ఈ షేర్ల విలువ దాదాపు రూ. 240 కోట్లు కాగా, స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. ఈ షేర్లను బహుమతిగా స్వీకరించడం వల్ల, ఇన్ఫోసిస్‌లో ఏకగ్రహ రోహన్ మూర్తికి 0.04 శాతం వాటా ఉంది.

1981లో ఇన్ఫోసిస్‌కు పునాది:

ఇక 1981లో ఇన్ఫోసిస్‌ పునాది వేసిన ఎన్‌ఆర్ నారాయణ్ మూర్తి.. డిసెంబర్ 2023 నాటి షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం కంపెనీలో 0.40 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇందులో ఇటీవలే 0.04 శాతం వాటాను తన మనవడు ఏకగ్రహ రోహన్ మూర్తికి బహుమతిగా ఇచ్చాడు. దీని ప్రకారం, నారాయణ మూర్తికి ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో 0.36 శాతం వాటా మిగిలి ఉంది. స్టాక్ షేర్ హోల్డింగ్ సరళి ప్రకారం.. అతను కంపెనీకి చెందిన 1.51 కోట్ల షేర్లను కలిగి ఉన్నాడు.

సుధా మూర్తి: 

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు సుధా మూర్తి, ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి భార్య, వ్యాపారవేత్త, ప్రసిద్ధ రచయిత్రి. ఇన్ఫోసిస్‌లో సుధా మూర్తికి 0.93 శాతం వాటా ఉంది. డిసెంబర్ 2023 వరకు ఉన్న డేటా ప్రకారం.. ఈ షేర్ హోల్డింగ్ కింద సుధా మూర్తి 3,45,50,626 ఇన్ఫోసిస్ స్టాక్‌లను కలిగి ఉన్నారు. వ్యాపార రంగం తర్వాత సుధా మూర్తి ఇప్పుడు రాజకీయ వర్గాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఆమె ఇటీవల రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

Rishi Sunak

Rishi Sunak

అక్షతా మూర్తి:

నాయరన్ మూర్తి-సుధా మూర్తి బ్రిటీష్ ప్రధాన మంత్రి (UK PM) రిషి సునక్ అత్తమామలు. వారి కుమార్తె అక్షతా మూర్తి రిషి సునక్‌ను వివాహం చేసుకున్నారు. ఇన్ఫోసిస్‌లో అక్షత కూడా ప్రధాన వాటాను కలిగి ఉంది. షేర్ హోల్డింగ్ విధానం ప్రకారం, యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి ఇన్ఫోసిస్‌లో 3,89,57,096 షేర్లను కలిగి ఉన్నారు. కంపెనీలో వాటాను లెక్కిస్తే, అది దాదాపు 1.05 శాతం. అక్షతా మూర్తి-రిషి సునక్‌లకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రోహన్ మూర్తి:

అక్షతా మూర్తి వలె, నారాయణ్ మూర్తి- సుధా మూర్తిల కుమారుడు రోహన్ మూర్తి కూడా ఇన్ఫోసిస్‌లో పెద్ద వాటాను కలిగి ఉన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడి కుమారుడు రోహన్ మూర్తికి ఇన్ఫోసిస్‌లో 6,08,12,892 షేర్లు ఉన్నాయి. అలాగే కంపెనీలో అతని వాటా 1.64 శాతం. రోహన్ మూర్తి కూడా లండన్‌లో ఉంటూ సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నారు. రోహన్ AI కంపెనీ సొరోకో వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. 2022 సంవత్సరంలో సొరోకో ఆదాయం రూ. 150 కోట్లు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి