EPFO News: ఈపీఎఫ్‌ఓ పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్.. ఆ గడువు పెంచుతూ కీలక నిర్ణయం
అధిక పింఛన్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని ఆదేశించడంతో వేతన వివరాలను అప్‌డేట్ చేయడానికి గడువు ఇచ్చింది. అయితే ఈ గడువును దఫదఫాలుగా పెంచుతూ సెప్టెంబర్ 30న తుది గడువుగా ప్రకటించింది. అయితే సెప్టెంబరు 30తో ముగియనున్న వేతన వివరాలను అప్‌లోడ్ చేయడానికి గడువు తేదీని ఎంప్లాయర్స్ & ఎంప్లాయర్స్ అసోసియేషన్‌ల నుండి వచ్చిన సూచనల మేరకు పొడిగించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.

ఈపీఎఫ్‌ఓ అంటే ఉద్యోగ భవిష్య నిధి. మనం జీవితాంతం ఉద్యోగం చేసి రిటైరయ్యాక మనకు ఆర్థికంగా అండగా నిలబడుతుంది. ఇందుకోసం నెలనెలా నిర్ణీత మొత్తంలో మన శాలరీ నుంచి కంట్రిబ్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏళ్లుగా పని చేస్తున్న వారికి వందల్లో పింఛన్ రావడంతో అందరికీ అధిక పింఛన్ రావడానికి కొన్ని రోజుల పాటు ఈపీఎఫ్‌ఓ కంట్రిబ్యూషన్ పెంపును ప్రకటించింది. అయితే ఈ పథకం ద్వారా అధిక పింఛన్ కోరుకున్నా కొంత మందికి సాధారణ పింఛన్ వస్తుంది. దీంతో వారు కోర్టును ఆశ్రయించడం కోర్టు అధిక పింఛన్ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలని ఆదేశించడంతో వేతన వివరాలను అప్‌డేట్ చేయడానికి గడువు ఇచ్చింది. అయితే ఈ గడువును దఫదఫాలుగా పెంచుతూ సెప్టెంబర్ 30న తుది గడువుగా ప్రకటించింది. అయితే సెప్టెంబరు 30తో ముగియనున్న వేతన వివరాలను అప్‌లోడ్ చేయడానికి గడువు తేదీని ఎంప్లాయర్స్ & ఎంప్లాయర్స్ అసోసియేషన్‌ల నుండి వచ్చిన సూచనల మేరకు పొడిగించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.
దరఖాస్తుదారు పెన్షనర్లు / సభ్యుల వేతన వివరాలను అప్‌లోడ్ చేయడానికి తదుపరి సమయాన్ని పొడిగించాలని అభ్యర్థనలు చేశారు. ముఖ్యంగా ఎంపిక / జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం 5.52 లక్షల దరఖాస్తులు సెప్టెంబర్ 29, 2023 నాటికి యజమానుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అందువల్ల వారి అభ్యర్థనను సానుభూతితో పరిగణించి వేతన వివరాలను సమర్పించడానికి డిసెంబర్ 31, 2023 వరకు సమయాన్ని పొడిగించారు. ఈ తాజా పొడిగింపుపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
దరఖాస్తుదారు పింఛనుదారులు/సభ్యుల వేతన వివరాలను అప్‌లోడ్ చేయడానికి కాల వ్యవధిని పొడిగించాలని అభ్యర్థనలు చేసిన ఎంప్లాయిర్స్ & ఎంప్లాయర్స్ అసోసియేషన్‌ల నుంచి వచ్చిన ప్రాతినిధ్యాల దృష్ట్యా, వేతన వివరాలను సమర్పించడానికి యజమానులకు మరో మూడు నెలల సమయం కూడా ఇవ్వబడింది. జూలై 11, 2023 వరకు పెన్షనర్లు / సభ్యుల నుండి ఆప్షన్ / జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం 17.49 లక్షల దరఖాస్తులు అందాయి. అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్/జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం దరఖాస్తులను సమర్పించడానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) గతంలో ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన ద్వారా తెలిపింది.
నవంబర్ 4, 2022న సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్హత కలిగిన పెన్షనర్లు / సభ్యుల కోసం ఈ సౌకర్యం కల్పించారు. ఈ సదుపాయం ఫిబ్రవరి 26, 2023న ప్రారంభించారు. అయితే మే 3, 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆ సమయంలో ప్రకటించినా ఉద్యోగుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని పూర్తి చేయడానికి గడువును జూన్ 26, 2023 వరకు పొడిగించారు. అనంతరం దఫదఫాలుగా ఈ గడవును సెప్టెంబర్ 30 వరకూ పెంచారు. అయితే తాజాగా డిసెంబర్ 31 వరకూ గడువు పెంచినా పింఛనుదారులు/సభ్యులు ఎదుర్కొంటున్న ఏవైనా ఇబ్బందులను తొలగించడానికి 15 రోజుల చివరి అవకాశం మాత్రమే ఇచ్చారు. ఈ విషయాన్ని యాజమాన్యాలతో పాటు ఉద్యోగులు గమనించాల్సి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..