AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS Apache RTR 160: అపాచీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్స్‌తో రేసర్ ఎడిషన్ లాంచ్

భారతదేశంలో యువతకు బైక్స్ అంటే మక్కువ ఎక్కువ. ముఖ్యంగా అత్యాధునిక ఫీచర్స్‌తో వచ్చే రేసింగ్ బైక్స్ అంటే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి టీవీఎస్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీకు చెందిన అపాచీ మోడల్ బైక్‌కు రేసింగ్ ఎడిషన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 2 వీ రేసింగ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

TVS Apache RTR 160: అపాచీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్స్‌తో రేసర్ ఎడిషన్ లాంచ్
Tvs Apache Rtr 160
Nikhil
|

Updated on: Jul 13, 2024 | 3:31 PM

Share

భారతదేశంలో యువతకు బైక్స్ అంటే మక్కువ ఎక్కువ. ముఖ్యంగా అత్యాధునిక ఫీచర్స్‌తో వచ్చే రేసింగ్ బైక్స్ అంటే అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి టీవీఎస్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీకు చెందిన అపాచీ మోడల్ బైక్‌కు రేసింగ్ ఎడిషన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 2 వీ రేసింగ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 1,28,720 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీఎస్ బైక్ షోరూమ్స్ వద్ద ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభించారు. అలాగే అపాచీ ఆర్‌టీఆర్ 160కు సంబంధించిన డ్యూయల్ డిస్క్ వేరియంట్ ధర రూ.1,27,220గా ఉంది. ముఖ్యంగా రేసింగ్ ఎడిషన్ విలక్షణమైన బాడీ గ్రాఫిక్స్, పెయింట్ స్కీమ్లను పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో అపాచీ ఆర్‌టీఆర్ 160 బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

అపాచీ ఆర్‌టీఆర్ 160 2 వీ రేసింగ్ ఎడిషన్ బైక్‌ గ్రే గ్రాఫిక్స్, రేసింగ్ రెడ్ స్ట్రిప్స్ యువతను అమితంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మ్యాట్ బ్లాక్ కలర్ స్కీమ్ బైక్‌కు స్టైలిష్ లుక్ జోడిస్తుంది. ముఖ్యంగా బాడీ ప్యానెల్స్‌పై కార్బన్ ఫైబర్ లుక్ ఆకర్షిస్తుంది. ఇది బైక్‌కు స్పోర్టీ లుక్‌ను అందిస్తుంది. ‘ట్రాక్ టు రోడ్’ ఎథోస్ ఫీచర్‌తో మోటార్ సైకిల్ రేస్-ప్రేరేపిత గ్రాఫిక్స్, రేసింగ్ ఎడిషన్ లోగోతో వస్తుంది. ఇది డైనమిక్ కాంట్రాస్ట్ కోసం అద్భుతమైన రెడ్ కలర్ స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో యువతను ఆకట్టుకుంటుది. 

రేసింగ్ ఎడిషన్ ప్రామాణిక అపాచీ ఆర్‌టీ 160 బైక్‌కు అనుగుణంగా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌లు, టెయిల్యాంప్‌లు, టీవీఎస్ గ్లైడ్ త్రూ టెక్నాలజీతో పాటు టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీని అనుసంధానించే ఎల్‌సీడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్‌తో వస్తుంది. అలాగే రైడర్లు మూడు రైడింగ్ మోడ్లను ఎంచుకోవచ్చు. స్పోర్ట్, అర్బన్, రెయిన్ మోడ్స్‌ను విభిన్న రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఎంచుకోవచ్చు.  హార్డ్ వేర్ బ్యాలెన్స్డ్ హ్యాండ్లింగ్ కోసం ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో గ్యాస్- ఛార్జ్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. బ్రేకింగ్ పనితీరు 270 ఎంఎం ఫ్రంట్ పెటల్ డిస్క్, సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో 220 ఎంఎం వెనుక పెటల్ డిస్క్ ద్వారా ఈ బైక్ అమితంగా ఆకట్టుకుంటుంది. అపాచీ రేసింగ్ ఎడిషన్‌లో విశ్వసనీయమైన 159.7సీసీ సింగిల్-సిలిండర్, టూ-వాల్వ్ ఇంజన్ 15.82 బీహెచ్‌పీ శక్తిని, 13.85 ఎన్ఎం టార్క్‌ను ప్రతిస్పందించే ఐదు-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి