AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MCLR Hike: కస్టమర్లకు ఆ బ్యాంక్ షాక్.. భారీగా వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటన

తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శుక్రవారం నుంచి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్- బేస్డ్ లెండింగ్ రేట్‌ను పెంచింది. ఈ మేరకు జూలై 9న బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఎంసీఎల్ఆర్ రేటు పెంపుతో కొత్త రుణ రేట్లు 8.15 శాతం నుంచి 8.90 శాతం వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో రుణ వడ్డీ రేటు విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకున్న తాజా నిర్ణయం మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

MCLR Hike: కస్టమర్లకు ఆ బ్యాంక్ షాక్.. భారీగా వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటన
Money
Nikhil
|

Updated on: Jul 13, 2024 | 3:45 PM

Share

భారతదేశంలోని బ్యాంకులు రుణ మంజూరు విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేందుకు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శుక్రవారం నుంచి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్- బేస్డ్ లెండింగ్ రేట్‌ను పెంచింది. ఈ మేరకు జూలై 9న బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఎంసీఎల్ఆర్ రేటు పెంపుతో కొత్త రుణ రేట్లు 8.15 శాతం నుంచి 8.90 శాతం వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో రుణ వడ్డీ రేటు విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకున్న తాజా నిర్ణయం మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులు ప్రతి నెలా తమ ఎంసీఎల్ఆర్‌ను సమీక్షించాల్సి ఉంటుంది. అందువల్ల బ్యాంకు ఆఫ్ బరోడా ఇటీవల ఎంసీఎల్‌ఆర్‌ను సమీక్షించింది. అందువల్ల వివిధ పదవీకాలానికి వడ్డీ రేట్లను సవరించింది. అందువల్ల  ఓవర్ నైట్ రేటు 8.10 శాతం నుంచి 8.15 శాతంగా ఉంటుంది. ఒక నెల రేటు 8.30 శాతం నుంచి 8.35 శాతంగా ఉంటుంది. మూడు నెలల రేటు 8.45 శాతం వద్ద ఎటువంటి మార్పు లేదు. ఆరు నెలల రేటు 8.65 శాతం నుంచి 8.70 శాతానికి పెరుగుతుంది. ఒక సంవత్సరం రేటు 8.85 శాతం నుంచి 8.90 శాతానికి పెరుగుతుంది. 

ప్రస్తుతం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు ధర 0.3 శాతం తగ్గి రూ.261.70 వద్ద స్థిరపడింది. బ్యాంక్ గ్లోబల్ బిజినెస్ ఏడాది ప్రాతిపదికన 8.52 శాతం పెరిగి రూ.23.77 లక్షల కోట్లకు చేరుకుంది. గ్లోబల్ డిపాజిట్లలో బలమైన పెరుగుదల ఈ వృద్ధికి ప్రధాన కారణం. ఇది ఏడాది ప్రాతిపదికన 8.83 శాతం పెరిగి రూ.13.05 లక్షల కోట్లకు చేరుకుంది. అదనంగా బ్యాంక్ గ్లోబల్ అడ్వాన్‌లు ఏడాది ప్రాతిపదికన 8.14 శాతం పెరిగి రూ.10.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దేశీయంగా బ్యాంకు డిపాజిట్లు గత ఏడాదితో పోలిస్తే 5.25 శాతం పెరిగి రూ.11.05 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే 7,500 కోట్ల వరకు అదనపు మూలధనాన్ని సమీకరించేందుకు గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి