Gold Silver Price Today: గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

Gold Silver Price Today: గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold And Silver
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 28, 2022 | 6:09 AM

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. వాస్తవానికి ప్రతిరోజూ మార్కెట్లో (Bullion Market) ధరల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా గురువారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.48,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,860 గా ఉంది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ.64,700 గా ఉంది. ధర రూ.300 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,860 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,860 గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,620, 24 క్యారెట్ల ధర రూ.53,040 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,860 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,860 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,860 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.48,450, ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,860 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,860గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,700 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.64,700 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.69,800 ఉంది. బెంగళూరులో రూ.69,800, కేరళలో రూ.69,800 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,800, విజయవాడలో రూ.69,800, విశాఖపట్నంలో రూ.69,800 లుగా కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

PM SVANidhi: చిరు వ్యాపారస్తులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం స్వీనిధి పథక కాలం పొడిగింపు

KTR in Plenary: బీజేపీ చేతిలో అధికారం – భారతావనికి అంధకారం.. కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరంః కేటీఆర్