Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: పసిడి మరింత పైపైకి… పెట్టుబడికి ఇది సమయమేనా?

ఇంట్రస్టింగ్‌ మ్యాటర్‌ ఏంటంటే.. గత 500 ఏళ్లుగా ప్రపంచంలో ఎక్కడ బంగారం తవ్వినా సరే.. అటు తిరిగి ఇటు తిరిగి అది మన భారతదేశానికే వస్తోంది. దక్షిణ అమెరికా గనుల్లో తవ్వినా, దక్షిణాఫ్రికాలో మైనింగ్‌ చేసినా.. భారతీయ అతివల మెడలో ఆభరణంగానో, వేలికి ఉంగరంగానో, ముక్కుపుడకగానో మారుతోంది. దేశ విదేశాల నుంచి అంతంత బంగారం దేశానికి వస్తుంటే.. ఏం చేయాలో తెలియక చీర అంచుల దాకా పసిడి చొప్పించేశాం. బంగారానికి భారతదేశానికి ఉన్న అనుబంధం ఎంతటిదో చెప్పడానికే ఈ ఉదాహరణ. పరాయి పాలకులు ఆలయాల్లోని స్వర్ణరాశులను దోచుకెళ్లారేమో గాని.. ఇంటి, ఒంటి బంగారం అలాగే ఉంది. ఇప్పటికీ.. బీరువాల్లో, నగల పెట్టెల్లోనే ఉండిపోయింది. సరిగ్గా ఈ పాయింట్‌ దగ్గరే కొత్త ఆలోచన చేస్తున్నారు కొత్తతరం ఇన్వెస్టర్లు. ఆ కాలంలో కాసు బంగారం వందకో, వెయ్యికో కొనుంటారుగా అమ్మమ్మలు, నానమ్మలు..! ఇప్పుడదే బంగారం లక్ష దాటిందిగా. ఇప్పుడైనా సరే ఎందుకని ఆ బంగారాన్ని అమ్ముకోకూడదు? బీరువాలో బంగారం ఉండడం శుద్ధదండగ అనేది నేటి ఆర్థికవేత్తల మాట. విలువ పెరిగాక అమ్మి ఆస్తులు కొనుక్కోవడమే తెలివైన ఆలోచన అంటున్నారు. ఆ దిశగా ఎందుకని ఆలోచించకూడదు? పాత బంగారం అమ్మడం ఎంత వరకు లాభం?

Gold: పసిడి మరింత పైపైకి... పెట్టుబడికి ఇది సమయమేనా?
Gold
Ram Naramaneni
|

Updated on: Sep 23, 2025 | 9:43 PM

Share

కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రపంచ దేశాలు దివాళా తీశాయి. కాని, భారత్‌ మాత్రం నిలదొక్కుకుంది. కారణం.. ఇంటి ఇల్లాలి బంగారం అమ్మడం వల్లే. ఆలికి సింగారం అమ్మకానికి బంగారం అని ఊరికనే అనలేదు పెద్దవాళ్లు. సందర్భానికి తగ్గట్టు బంగారాన్ని అమ్మడమే కరెక్ట్. అలాగే.. పెట్టుబడి అవకాశం వచ్చినప్పుడు కూడా బంగారాన్ని తీస్తే తప్పేం లేదు. అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు బంగారాన్ని అమ్ముకోకపోవడమే తప్పు అంటుంటారు ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్స్‌.  1925లో పదిగ్రాముల బంగారం 18 రూపాయల 75 పైసలు. దేశ స్వాతంత్రం నాటికి అదే పది గ్రాముల బంగారం 88 రూపాయలు. 1959లో మొదటిసారి వంద రూపాయలు దాటింది పది గ్రాముల పసిడి. సరే.. లాంగ్‌ కూడా అక్కర్లేదు. 1980లలో చూడండి. పది గ్రాముల బంగారం వెయ్యి రూపాయలను టచ్‌ చేసింది. అంత ధర పలకడం చరిత్రలో అదే ఫస్ట్‌టైమ్‌. సో, చాలామంది ఇళ్లల్లో ఇప్పటికీ ఆనాటి బంగారమే ఉంటుంది. ఎన్నో మెరుగులు దిద్దుకుంటూ, కొత్త ఆభరణాలుగా మారుతూ వస్తోంది. మరి… ఆనాడు వెయ్యి రూపాయలకు కొన్న దాన్ని ఇవాళ లక్ష రూపాయలకు అమ్ముకుంటే లాభం కాదా? ఏకంగా వంద రెట్లు పెరిగింది బంగారం ధర. అమ్మితే కచ్చితంగా లాభమే. ‘అది నష్టం’ అని చెప్పే ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్సే ఉండరు. ఎలాంటి సందర్భంలో నష్టం అని చెబుతారంటే.. రేప్పొద్దున బంగారం ధర ఇంకా పెరిగితే? అది నష్టమే కదా? నిజమే. ప్రస్తుతం తులం బంగారం...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి