Gold Price Today: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. 24 క్యారెట్ల పసిడి ధర ఎంత పెరిగిందంటే..
Gold and Silver Price Today: అంతర్జాతీయంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అందుకే బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని సార్లు ధరలు పెరిగితే..

Gold and Silver Price Today: అంతర్జాతీయంగా పసిడికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అందుకే బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని సార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. అయితే.. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. స్వర్ణం ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా మళ్లీ ధరలు పెరిగాయి. మంగళవారం బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి.. రూ.54,350 కి చేరగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,280గా ఉంది. వెండి ధర కిలో.. 70,900 లుగా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.54,700 లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,670 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 54,350 ఉంటే.. 24 క్యారెట్ల ధర 59,280 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 54,500, 24 క్యారెట్ల ధర 59,430, బెంగళూరులో 22 క్యారెట్ల ధర 54,350, 24 క్యారెట్ల ధర59,280గా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ లో 22 క్యారెట్ల ధర రూ.54,350, 24 క్యారెట్ల రూ.59,280, విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.54,350, 24 క్యారెట్ల రూ.59,280, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.54,350, 24 క్యారెట్ల రూ.59,280గా ఉంది.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. చెన్నైలో కిలో వెండి ధర.. రూ. 75,200 లు ఉండగా.. ముంబైలో 70,900లు, ఢిల్లీలో 70,900, బెంగళూరులో 70,250, హైదరాబాద్ లో 75200, విజయవాడలో 75200, వైజాగ్ లో 75200లు గా కొనసాగుతోంది.




గమనిక.. ఈ ధరలు మంగళవారం ఉదయం వరకు నమోదైనవి మాత్రమే.. ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది గమనించగలరు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..
