AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: ఆషాడంలో బంగారం ధర పెరుగుతుందా? తగ్గుతుందా..? ప్రస్తుతం తులం ధర ఎంత?

Gold, Silver Prices: బంగారం ధరలు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు ఎందుకంటే బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితిలకు అనుగుణంగా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్..

Gold Rate Today: ఆషాడంలో బంగారం ధర పెరుగుతుందా? తగ్గుతుందా..? ప్రస్తుతం తులం ధర ఎంత?
Today Gold Price
Subhash Goud
|

Updated on: Jul 12, 2026 | 6:46 AM

Share

Gold Rate Today: ఆషాడ మాసం ప్రారంభం కానుంది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఊగిసలాడుతున్నాయి. గతంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. అయితే గత నాలుగైదు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెద్దగా దిగడం లేదు.. పెద్దగా తగ్గడం లేదు. స్వల్ప మార్పులతో కొనసగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది. అయితే నిన్న ఒక్క రోజు బంగారం ధర రూ.500 వరకు తగ్గుముఖం పట్టింది. అదే వెండి ధర రూ.500 వరకు తగ్గింది. తాజాగా జూలై 12 దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు తెలుసుకుందాం..

  1. హైదరరాబాద్‌ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడ -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీ- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,480 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,450 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబై -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నై -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,090 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,000 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరు -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది.
  7. కోల్‌కతా -24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది.
  8. కేరళ – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,330 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే.. హైదరాబాద్‌, చెన్నై, చెన్నైలలో కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా ఇతర నగరాల్లో రూ.2,35,000 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర నిన్న ఒక్క రోజే 5000 రూపాయల వరకు దిగి వచ్చింది.

సాధారణంగా లోకల్ సెంటిమెంట్ ఆధారంగా చూసినట్లయితే బంగారం ధరలు ఆషాడంలో తగ్గుతాయని చాలామంది భావిస్తూ ఉంటారు. దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది ఎందుకంటే ఆషాడమాసంలో పెళ్లిళ్లు శుభకార్యాలు జరగవు. ముఖ్యంగా ఆషాడ మాసంలో బంగారు ఆభరణాల షాపింగ్ కూడా చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించరు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బంగారు దుకాణాల యాజమాన్యాలు కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను కూడా ముందుకు తెస్తుంటాయి. అందుకే ఈ మాసంలో ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

ఆషాడంలో బంగారం ధర పెరుగుతుందా లేక తగ్గుతుందా..?

ఆషాడ మాసం జూలై 15వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే ఆగస్టు 14వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసినట్లయితే ఆషాడమాసంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ అంచనాల ప్రకారం ఒడిదుడుకులకు లోన అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది పూర్తిగా అంతర్జాతీయ పరిణామాల పైన ఆధారపడి ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆషాడ మాసంలో స్థానికంగా బంగారం సేల్స్ పెంచుకునేందుకు పరిమితమైన రేంజ్ లో ఆఫర్లను ప్రకటించే అవకాశం ఉంటుంది. కనుక ఇది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: iPhone: ఐఫోన్‌ సైడ్‌కు ఉండే ఆ గీతల వెనుక ఇంత పెద్ద సీక్రెట్ ఉందా? ఇది డిజైన్ పొరపాటే..!

ఇది కూడా చదవండి: Post Office: ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.9000 ఆదాయం..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us