AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: వామ్మో.. బంగారం ధరలపై బిగ్ బాంబ్.. 2027 నాటికి ధరలు అంత పెరుగుతాయా..?

బంగారం ధరలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్ధాయి రూ.1.90 లక్షలకు చేరుకోగా.. అక్కడ నుంచి పడిపోతూ వస్తోన్నాయి. ప్రస్తుతం రూ.1.45 లక్షల వద్ద కొనసాగుతున్నాయి. ఇటీవల రూ.1.40 లక్షలకు పతనమయ్యాయి. గత వారంలో మళ్లీ పుంచుకున్నాయి. రాబోయే రోజుల్లో..

Gold Prices: వామ్మో.. బంగారం ధరలపై బిగ్ బాంబ్.. 2027 నాటికి ధరలు అంత పెరుగుతాయా..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Jul 06, 2026 | 9:38 PM

Share

బంగారం ధరల తీవ్రంగా పడిపోయాయి. తమ రికార్డు స్థాయి గరిష్ఠాల నుండి భారీగా పతనమవుతున్నాయి. దాదాపు 5,600 డాలర్ల నుండి 30 శాతానికిపైగా తగ్గి 4,000 డాలర్ల కంటే దిగువకు చేరాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగుతున్నప్పటికీ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పెట్టుబడిదారులు బంగారం లాంటి సురక్షిత పెట్టుబడుల కంటే కంటే.. వడ్డీ రేట్లు, బాండ్ రాబడులు, ఇతర పెట్టుబడి మార్గాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని, పసిడి ధరల పతనానికి ఇదే కారణమని నిపుణులు చెబుతున్నారు. బంగారం కొనుగోలు చేసేవారికి ఇదే మంచి సమయంగా చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ధరలు తగ్గుతాయా.. లేదా పెరుగుతాయా అనే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. కొంతమంది పెరుగుతాయని, మరికొంతమంది తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే నిపుణులు ఏమంటున్నారంటే..?

మరింత పెరుగుతాయా..?

దాదాపు 5,600 డాలర్లకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించిన గోల్డ్ ధరలు.. ఇప్పుడు 4,000 డాలర్ల కంటే దిగువకు చేరుకుంది. 30 శాతానికిపైగా ధరలు దిగొచ్చాయి. ఆరు నెలల్లో బంగారం ధరలు భారీగా కుప్పకూలుతూ వస్తోన్నాయి. అయితే రాబోయే కొద్ది వారాల్లో బంగారం ధర తిరిగి 4 వేల డాలర్లకు పెరగవచ్చని చెబుతున్నారు. 2026 చివరి నాటికి 4,900 డాలర్ల నుంచి 5 వేల డాలర్లకు పెరగవచ్చని అంటున్నారు. 2027లో మళ్లీ ఆల్ టైం రికార్డ్ స్థాయికి గోల్డ్ రేట్లు చేరుకుంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 3,950 నుంచి 4,000 వద్ద బలమైన మద్దతు జోన్‌గా ఉంది. ఈ పాయింట్ల వద్ద గతంలో ధరలు పుంజుకున్నాయి. ఇప్పుడు కూడా అదే జరగనుందని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో పెట్టుబడిదారులు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన వైఖరిని, ద్రవ్యోల్బణ డేటాను, డాలర్ కదలికలు, భారత్, చైనా, మధ్యప్రాచ్యం వంటి కీలక వినియోగ మార్కెట్ల నుండి భౌతిక డిమాండ్‌ను నిశితంగా పర్యవేక్షిస్తారు. ఇవన్నీ బంగారం ధరలలో తదుపరి కదలికను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు.

ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..?

ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,620 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,400 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ధరలు సోమవారం రూ.10 వేల మేర పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర రూ.2.50 లక్షల వద్ద ట్రేడవుతోంది.

Follow Us