AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి

ఇతర వస్తువుల మాదిరిగానే డిమాండ్, సరఫరా బంగారం ధరపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. తక్కువ సరఫరా, ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ధర పెరుగుతుంది. అదేవిధంగా అదనపు సరఫరా, స్థిరమైన లేదా బలహీనమైన డిమాండ్ కారణంగా బంగారం ధర తగ్గుతుంది. సాధారణంగా, పండుగ, పెళ్లిళ్ల సీజన్లలో భారతదేశంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది..

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి
Gold RateImage Credit source: TV9 Telugu
Subhash Goud
|

Updated on: Oct 21, 2023 | 6:16 AM

Share

బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. పండగ సీజన్‌ ఇంకా ఎగబాకుతూనే ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో మహిళలలో బంగారం షాపులన్ని కిటకిట లాడుతుంటాయి. అలాంటి సమయంలో ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల తులం బంగారంపై 700 రూపాయల వరకు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారంపై 770 రూపాయల వరకు పెరిగింది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,750 ఉంది. అలాగే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు 56,400 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 61,530 వద్ద కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,690 వద్ద ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 61,530 రూపాయలు వద్ద ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 56,400 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,530 ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు 54,400 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 61,530 రూపాయలు ఉంది.  ఇక దేశంలో వెండి ధర మాత్రం నిలకడగానే ఉంది. ప్రస్తుతం కేజీ సిల్వర్‌ ధర 74,100 రూపాయల వద్ద కొనసాగుతోంది.

పెద్ద నగరాల్లో బంగారం ధరలు డిమాండ్, వడ్డీ వసూలు, ఆక్ట్రాయ్ ఛార్జీలు, రాష్ట్ర పన్నులు, బంగారు వ్యాపారులు, బులియన్ అసోసియేషన్లు, రవాణా ఖర్చులు, మేకింగ్ ఛార్జీలు వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు నగరాన్ని బట్టి మారవచ్చు. భారతదేశంలో బంగారం ధరను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి కోసం బంగారానికి చాలా డిమాండ్ ఉంది. ఇతర ఆర్థిక ఆస్తుల మాదిరిగానే, బంగారం ధర కూడా హెచ్చుతగ్గులకు గురవుతుంది. దాని మార్కెట్ ధరను నిర్ణయించడంలో అతిపెద్ద అంశం డిమాండ్. అయితే, అనేక ఇతర అంశాలు కూడా ధరను ప్రభావితం చేయవచ్చు.

ఇతర వస్తువుల మాదిరిగానే డిమాండ్, సరఫరా బంగారం ధరపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. తక్కువ సరఫరా, ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ధర పెరుగుతుంది. అదేవిధంగా అదనపు సరఫరా, స్థిరమైన లేదా బలహీనమైన డిమాండ్ కారణంగా బంగారం ధర తగ్గుతుంది. సాధారణంగా, పండుగ, పెళ్లిళ్ల సీజన్లలో భారతదేశంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. బంగారం స్వచ్ఛతను ‘క్యారెట్స్’ ప్రామాణిక యూనిట్‌లో కొలుస్తారు. 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం. అయితే, ఈ బంగారం ద్రవ రూపంలో ఉంటుంది. ఆభరణాలు, నాణేలు లేదా బార్‌లుగా మార్చబడదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి