బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడిచిన కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గురువారం స్థిరంగా కొనసాగిన బంగారం ధర, శుక్రవారం మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోయింది. తులంపై ఏకంగా రూ. 100 పెరగడం గమనార్హం. దీంతో దేశంలో శుక్రవారం 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 54,250కి చేరగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,160 వద్ద కొనసాగుతోంది. మరి ఈ రోజు దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* ఢిల్లీలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 54,400, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 59,320.
* చెన్నైలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 54,600, 24 క్యారెట్స్ బంగారం రూ. 59,560
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 54,250, 24 క్యారెట్స్ బంగారం రూ. 59,160
* హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ ధర రూ. 54,250, 24 క్యారెట్స్ ధర రూ. 59,160
* నిజమాబాద్‌లో 22 క్యారెట్ల ధర రూ. 54,250, 24 క్యారెట్స్ ధర రూ. 59,160
* విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 54,250, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 59,160
* విశాఖపట్నంలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 54,250, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 59,160గా ఉంది.
బంగారం కూడా వెండి బాటలోనే సాగుతోంది. వెండిధరలో కూడా పెరుగుదల కనిపించింది. ఢిల్లీలో కిలో వెండి రూ. 73,000, బెంగళూరులో రూ. 71,250, హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 76,700, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,700వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..