Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: షాకిస్తున్న బంగారం ధరలు.. ఈ ప్రాంతాల్లో స్థిరంగా ఉంటే.. అక్కడ మాత్రం భారీగా పెరిగింది..!

Gold Price Today: మన దేశంలో బంగారానికి మహిళలకు అత్యంత విలువ ఇస్తుంటారు. పసిడి ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రతి రోజు భారీ ఎత్తున కొనుగోళ్లు..

Gold Price Today: షాకిస్తున్న బంగారం ధరలు.. ఈ ప్రాంతాల్లో స్థిరంగా ఉంటే.. అక్కడ మాత్రం భారీగా పెరిగింది..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 09, 2021 | 6:13 AM

Gold Price Today: మన దేశంలో బంగారానికి మహిళలకు అత్యంత విలువ ఇస్తుంటారు. పసిడి ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రతి రోజు భారీ ఎత్తున కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో ఇక చెప్పనవసరం లేదు. వివిధ కారణాల వల్ల దేశంలో బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ధరలు ఒక పెరిగి పెరిగితే ఒక రోజు తగ్గుతుంది.. లేకపోతే స్థిరంగా కొనసాగుతుంటాయి. ఇక తాజాగా మంగళవారం (నవంబర్ 9)న దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల భారీగా పెరిగాయి. కొన్ని నగరాల్లో స్వల్పంగానూ, మరి కొన్ని నగరాల్లో భారీగా, మరి కొన్ని నగరాల్లో స్థిరంగా ఉన్నాయి. మొత్తం మీద దేశీయంగా బంగారం ధరలను పరిశీలిస్తే 10 గ్రాముల బంగారంపై రూ.810పై పెరిగింది. అయితే హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగలూరు, చెన్నై కేరళ, కోల్‌కతా, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో స్థిరంగా కొనసాగుతుండగా ఒక్క ముంబైలో మాత్రం 10 గ్రాములపై రూ.810 ఎగబాకింది. ఇక పెళ్లిళ్ల సీజన్‌ కూడా వస్తుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరలు.. ► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,560గా ఉంది.

► ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,030గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,420 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,570 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,210 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. ► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210గా ఉంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,110 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,210గా ఉంది.

బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

PM Kisan: దుర్వినియోగం అవుతున్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ స్కీమ్‌.. ఇక్కడ అనర్హులకే బెనిఫిట్‌.. అధికారుల విచారణ

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఈ ఖాతా తెరిస్తే ప్రతి నెలా రూ.5 వేలు పొందవచ్చు