Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగి వస్తున్న పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!
Gold Price Today: బంగారం ధరలు ఒక రోజు పెరుగుతూ ఉంటే మరోరోజు తగ్గుతూ వస్తోంది. రూ.50 వేల వరకు దాటిన పసిడి ధరలు మెల్లమెల్లగా దిగి వస్తున్నాయి..
Gold Price Today: బంగారం ధరలు ఒక రోజు పెరుగుతూ ఉంటే మరోరోజు తగ్గుతూ వస్తోంది. రూ.50 వేల వరకు దాటిన పసిడి ధరలు మెల్లమెల్లగా దిగి వస్తున్నాయి. ప్రస్తుతానికి 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.50వేల లోపు నమోదు అవుతున్నాయి. తాజాగా గురువారం మళ్లీ పసిడి ఎగబాకింది. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. మహిళలు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు చేయడం మాత్రం ఆగరు. అయితే తాజాగా 10 గ్రాముల ధరపై రూ.200 నుంచి రూ.300 వరకు తగ్గుముఖం పట్టింది. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పసిడి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం (ఆగస్టు 26) ఉదయం ఆరు గంటల సమయానికి నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,700 ఉంది.
► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.
► ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,490 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,280 ఉంది.
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380 ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380 ఉంది.
► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,380 ఉంది.
అయితే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.