Gold Price Today: మీరు బంగారం కొంటున్నారా..? మీకో షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన పసిడి ధర

|

Nov 06, 2022 | 6:39 AM

గత మూడు నాలుగు రోజుల నుంచి పుత్తడి పరుగులు పెడుతోంది. బ్రేకులు లేకుండానే పరుగులు పెడుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పరుగెడుతుంది. దీపావళి..

Gold Price Today: మీరు బంగారం కొంటున్నారా..? మీకో షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన పసిడి ధర
Gold Price
Follow us on

గత మూడు నాలుగు రోజుల నుంచి పుత్తడి పరుగులు పెడుతోంది. బ్రేకులు లేకుండానే పరుగులు పెడుతోంది. బంగారం బాటలోనే వెండి కూడా పరుగెడుతుంది. దీపావళి తర్వాత పసడి ధరలు బ్రేకులు లేకుండా వేగంగా పరుగులు పెడుతున్నాయి. దేశంలోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం షాపులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ప్రతి రోజు మార్పులు జరిగే బంగారం ధరల్లో ఈ రోజు భారీగానే పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ఏకకంగా రూ.900 వరకు పెరిగి ప్రస్తుతం రూ.47,000 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.990 వరకు పెరిగి ప్రస్తుతం రూ.51,280 ఉంది. ఇక కిలో వెండిపై రూ.1900 వరకు పెరిగి ప్రస్తుతం రూ.60,500 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు. బంగారం కొనుగోలు చేసే ముందు మీరు వెళ్లే సమయానికి ఎంత ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. ఇక తాజాగా నవంబర్‌ 6వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 వద్ద ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.

పుణేలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,310 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.

వెండి ధర:

వెండి ధర నిన్నటిలాగే ఈ రోజు కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.1900 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా రూ.60,500 ఉంది. ఇక నగరాల వారిగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.66,300, ముంబైలో రూ.60,500, ఢిల్లీలో రూ.60,500, కోల్‌కతాలో రూ.60,500, బెంగళూరులో రూ.60,500, కేరళలో రూ.66,300, పుణేలో రూ.60,500, హైదరాబాద్‌లో రూ.66,300, విజయవాడలో రూ.66,300, విశాఖలో కిలో వెండి రూ.66,300 వద్ద కొనసాగుతోంది. ఈ వెండి ధరలు కొన్ని నగరాల్లో స్వల్పంగా పెరుగగా, చాలా నగరాల్లో భారీగానే పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి