Gold Price: రూ.1.22 లక్షలు దాటిన బంగారం ధర.. రికార్డ్ స్థాయిలో వెండి!

Gold Price: దీపావళికి ముందు బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తులం బంగారం రూ.1.22 లక్షలు దాటింది. అదే విధంగా వెండి కూడా పరుగులు పెడుతోంది. దేశీయ డిమాండ్, అంతర్జాతీయ అనిశ్చితులు ధరల పెరుగుదలకు కారణం. పెట్టుబడిదారులు దీర్ఘకాలికంగా దీన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్నారు..

Gold Price: రూ.1.22 లక్షలు దాటిన బంగారం ధర.. రికార్డ్ స్థాయిలో వెండి!

Edited By:

Updated on: Oct 10, 2025 | 5:51 PM

Gold Price: దీపావళికి ముందు బంగారం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. అక్టోబర్‌ 7న మధ్యాహ్నం 2 గంటల సమయానికి తులం బంగారంపై రూ.1250 వరకు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,020 ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,850 వద్ద ఉంది. హైదరాబాద్‌, విజయవాడలో తులం ధర రూ.1,22,020 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో రూ.1,22,070 ఉంది.

ప్రస్తుతం కిలో వెండిపై వెయ్యి రూపాయలు పెరిగి రూ.1,57,000కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే మరింతగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.1,67,000 ఉంది.

ఇది కూడా చదవండి: Multibagger Stock: అద్భుతం సృష్టించిన స్టాక్‌.. రూ.1 లక్ష పెట్టుబడిని రూ.1.84 కోట్లుగా మార్చింది!

ఇవి కూడా చదవండి

ఇప్పుడు బంగారం ధర మరింత పెరుగుతుందా?

దీపావళికి ముందు బంగారం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశీయ డిమాండ్, ప్రపంచ అనిశ్చితి, ఫెడరల్ రిజర్వ్ విధానాల వల్ల బంగారం ధరలు రూ.1.22 లక్షలకు చేరుకున్నాయి. రాబోయే రోజుల్లో డాలర్ బలహీనపడి వడ్డీ రేట్లు తగ్గిస్తే, బంగారం ధరలు మరింత లాభాలను చూడవచ్చు.

ఈ పండుగ సీజన్‌లో బంగారంలో పెట్టుబడి పెట్టాలని మీరు ఆలోచిస్తుంటే, కొంత జాగ్రత్తలు అవసరమని నిపుణులు అంటున్నారు. బంగారం ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉంది. కానీ దీర్ఘకాలికంగా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. డిజిటల్ బంగారం, బంగారు ETFలు లేదా తక్కువ పరిమాణంలో భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడం ప్రస్తుతానికి మంచి ఎంపికలు కావచ్చు.

ఇది కూడా చదవండి: Hyderabad’s First Tesla EV: తెలంగాణలో మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్‌ కారును కొన్నది ఎవరో తెలుసా?

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం కూడా బంగారం ధరలను పెంచిందని వ్యాపారులు తెలిపారు. “బంగారం కొత్త రికార్డును తాకినప్పటికీ, పెట్టుబడిదారులు దానిలో పెట్టుబడి పెట్టడానికి ఎంచుకుంటున్నారు. బలమైన ఫండమెంటల్స్, బుల్లిష్ ట్రెండ్ ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని లాభాలను వారు ఆశిస్తున్నారు” అని HDFC సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ అన్నారు. అమెరికా ప్రభుత్వ దీర్ఘకాలిక షట్‌డౌన్ కారణంగా ఆర్థిక పనితీరుపై ఉన్న ఆందోళనలు కూడా ఈ సురక్షితమైన లోహానికి డిమాండ్‌ను పెంచుతున్నాయని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: Flipkart Diwali Sale: దీపావళీ బిగ్‌ సేల్‌ తేదీన ప్రకటించిన ఫ్లిప్‌ కార్ట్‌.. అంతకు మించి ఆఫర్లు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us