Gold Rate: బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? ఈ రోజు ధరలు ఇలా
గోల్డ్ కొనాలనుకున్నవారికి బ్యాడ్ న్యూస్. గోల్డ్ షాపింగ్ చేయాలనుకున్నవారు తమ కొనుగోళ్లు బంద్ పెట్టాల్సిందే. ఇక దిగువ మధ్యతరగతి కుటుంబాలైతే బంగారం మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. రోజురోజుకు కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి...

అమెరికాలో అలా ట్రంప్ వచ్చారో లేదో, బంగారం ధగధగలు పెరిగాయి. పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. పెరగడమేగానీ, తగ్గే ఛాన్సేలేదు అన్నట్లుగా గోల్డ్ స్పీడు పెరిగింది. లోకల్ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే షాక్ కొట్టేలా ఉంది. ఇప్పుడు బంగారానికి ఉన్న క్రేజు డాలర్‌కు కూడాలేదు. దాని అన్‌స్టాపబుల్ మార్కెట్ స్పీడ్‌కు మద్యతరగతికి చుక్కలు కనిపిస్తున్నాయి. మన ఇళ్లల్లో జరిగే ప్రతి శుభకార్యాలకు, పండుగలు పబ్బాలకు బంగారం లేనిదే పొద్దు గడవదు. కానీ ప్రస్తుత ధరలు చూస్తుంటే లోవర్ మిడిల్ క్లాస్ బంగారం కొనే పరిస్థితులే లేవు.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో తులం స్వచ్ఛమైన బంగారం రేటు రూ.82 వేలు దాటింది. ఇక పన్నులు, ఛార్జీలు కలిపితే మరింత ఎక్కువే ఉంటుంది. హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 83వేల 420 రూపాయలు పలుకుతోంది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 75,550గా ఉంది. వెండి ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. హైదరాబాద్‌లో సిల్వర్ రేట్ ప్రస్తుతం కిలో రూ.93,400 పలుకుతోంది. బంగారం పెట్టుబడులు పెరుగుతూ ఉండటంతో ధరలు పెరుగుతూ ఉన్నాయి.
హైదరాబాద్: 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర: రూ. 82,420, 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ధర: రూ. 75,550
విజయవాడ: 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర: రూ.82,430 , 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ధర: రూ.75,560
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి